Mahesh Kumar Goud: రాబోయే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఉనికే ఉండదు

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఉనికే లేదు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud)

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉనికే ఉండదని, ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయమే.

జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన మురళి గౌడ్, మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఇవాళ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని పీసీసీ చీఫ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.(Mahesh Kumar Goud)

కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు.

ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ,
“కేసీఆర్, కేటీఆర్, కవిత ప్రజలను అబద్దాలు ఆడి మోసం చేశారు. హరీశ్ రావు బనకచర్ల విషయంలో పచ్చి అబద్ధాలు చెబుతున్నారు,” అని తీవ్ర విమర్శలు చేశారు.

రేవంత్ రెడ్డి పాలనపై ప్రశంసలు.

“హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కృషి చేస్తున్నారు. ప్రజల ఆశయాలను నిజం చేసేలా పాలన సాగుతోంది,” అని కొనియాడారు.
అలాగే, ఇతర పార్టీల్లోనుండి పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటే, ప్రజల్లో పార్టీపై నమ్మకం ఎంత ఉందో తెలుస్తోంది” అని చెప్పారు.

Also Read :