బీఆర్ఎస్(BRS) లోకి నాగం, విష్ణు
ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరిక
గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్
దివంగత సీఎం అంజయ్య మనుమడు అభిషేక్ రెడ్డి కూడా..
హైదరాబాద్: మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ రెడ్డి, కరీంనగర్ కు చెందిన మైత్రి జైపాల్ రెడ్డి, దివంగత్ ముఖ్యమంత్రి అంజయ్య మనుమడు అభిషేకర్ రెడ్డి కాసేపటి క్రితం బీఆర్ఎస్(BRS) లో జాయిన్ అయ్యారు. తెలంగాణ భవన్ లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మొన్నటి వరకు కాంగ్రెస్ లో కొనసాగిన నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ టికెట్ ఆశించి భంగపడిన విషయం తెలిసిందే. మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలో చేరాలని ఆహ్వనించారు. దీంతో ఆయన నిన్న సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఇవాళ గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడ్డ విష్ణును మంత్రి హరీశ్ రావు పార్టీలోకి ఆహ్వనించగా సీఎం కేసీఆర్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆయన కూడా ఇవాళ బీఆర్‌ఎస్(BRS) లో చేరారు.
మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలో చేరాలని ఆహ్వనించారు. దీంతో ఆయన నిన్న సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఇవాళ గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడ్డ విష్ణును మంత్రి హరీశ్ రావు పార్టీలోకి ఆహ్వనించగా సీఎం కేసీఆర్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆయన కూడా ఇవాళ బీఆర్‌ఎస్(BRS) లో చేరారు.
More Read:
- niharika konidela: నవరాత్రి గురించి నిహారిక కొణిదెల ప్రత్యేక ఫోటోలు
- varun tej:వరుణ్ తేజ్ vs న్యూజిలాండ్ T20I మ్యాచ్కి వ్యాఖ్యానించాడు.

