Telangana : 24 నుంచి బడ్జెట్ సెషన్

ఈ నెల 24 నుంచి (Telangana) తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు ఈ సమావేశాలన నిర్వహించనున్నారు. 25లేదా 26వ తేదీన పూర్తి స్థాయి (Telangana) బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్ ఇతర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ నెల 25న కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అదే రోజు రాష్ట్ర బడ్జెట్ ఉంటుందా.. మరుసటి రోజు ప్రవేశపెడతారా..? అనేది తేలాల్సి ఉంది. బడ్జెట్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. వాళ్లు ఇచ్చే ఇన్ పుట్ ఆధారంగా బడ్జెట్ ను సిద్ధం చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.24 నుంచి బడ్జెట్ సెషన్
ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. 25లేదా 26వ తేదీన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్ ఇతర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ నెల 25న కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అదే రోజు రాష్ట్ర బడ్జెట్ ఉంటుందా.. మరుసటి రోజు ప్రవేశపెడతారా..? అనేది తేలాల్సి ఉంది. బడ్జెట్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. వాళ్లు ఇచ్చే ఇన్ పుట్ ఆధారంగా బడ్జెట్ ను సిద్ధం చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. 25లేదా 26వ తేదీన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్ ఇతర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ నెల 25న కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అదే రోజు రాష్ట్ర బడ్జెట్ ఉంటుందా.. మరుసటి రోజు ప్రవేశపెడతారా..? అనేది తేలాల్సి ఉంది. బడ్జెట్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. వాళ్లు ఇచ్చే ఇన్ పుట్ ఆధారంగా బడ్జెట్ ను సిద్ధం చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Also  Read:

iphone : ఐఫోన్ యూజర్లకు స్పైవేర్ ముప్పు

Chandrababu : ఏపీకి చమురుశుద్ధి కర్మాగారం!