సిద్ధార్థ్ లవ్ ఫెయిల్యూర్ మూవీతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ ఐశ్వర్యమీనన్. పుష్కరకాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆశించిన స్తాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు కార్తికేయకి జోడీగా భజే వాయువేగం(BV) సినిమాలో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ మూవీపై ఐశ్వర్య మీనన్ చాలా హోప్స్ పెట్టుకుంది. కచ్చితంగా మూవీ సక్సెస్ అవుతుందని భావిస్తోంది. తాజాగా ఈ మూవీ(BV) ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో ఐశ్వర్య మీనన్ తన గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘‘తమిళనాడులో ఈరోడ్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను. కాలేజీ డేస్ లో ఉన్నప్పుడే కమర్షియల్ యాడ్స్ లో నటించా. ఇంజనీరింగ్ తర్వాత పూర్తిగా సినిమాలపై ఫోకస్ చేశాను. ఆఫర్స్ సంగతి ఎలా ఉన్న ప్రేక్షకుల యాక్సప్ట్ పొందడం అనేది ఇండస్ట్రీలో ముఖ్యం. ఆ విషయంలో నేను సక్సెస్ అయ్యాను. కెరియర్ పరంగా గుర్తింపు పొందడం కోసం ప్రయత్నిస్తున్నాను. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో సినిమాలు చేస్తున్నా. సినిమాలు చేస్తున్నప్పుడు మన పాత్ర వరకు పూర్తిగా న్యాయం చేయడం ముఖ్యం. ఇక సినిమా ఫలితం అనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. భజేవాయువేగం చిత్రంలో ట్రెడిషనల్ గా కనిపించే అమ్మాయి క్యారెక్టర్ నాది. కథలో నా పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కువగా ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లోనే మూవీలో కనిపిస్తాను. ’అని చెప్పింది ఐశ్వర్య మీనన్.
ALSO READ :

