Lucknow : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మరోసారి హత్య బెదిరింపు కాల్ వచ్చింది. అత్యవసర సేవల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నంబర్ డయల్ 112 కు మెసేజ్ ద్వారా ఆయనకు బెదిరింపు కాల్ వచ్చింది. అందులో తాను త్వరలో సీఎం యోగిని చంపుతానని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. యోగి బెదిరింపు కాల్ రావడంతో 112 ఆపరేషన్ కమాండర్ సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 506, 507, ఐటీ యాక్ట్ 66 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని రిహాన్ గా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యోగికి ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం ఇదేం మొదటిసారి కాదు.
ALSO READ :
- ప్రియుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి
- రిజర్వేషన్లపై బీఆర్ఎస్, ఎంఐఎంస్టాండ్ ఏమిటి?
- RAGHUNANDAN RAO: ఏం మాట్లాడిన్నో యాదికి లేదు
- BANDI SANJAY: ఖమ్మం జైలుకు బండి సంజయ్

