అధికారులు నన్నే లెక్క చేస్తలేరు నాకే అవమానం జరిగింది. ఇక సామాన్య ప్రజలు వారికి ఓ లెక్కనా..? అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య (Bakki Venkataiah) ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ మెదక్ సమీకృత కలెక్టరేట్ లో ఎస్సీ ఎస్టీల భూముల సమస్యలు, అట్రాసిటీ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
బక్కి వెంకటయ్య (Bakki Venkataiah) మీడియాతో మాట్లాడారు.. మెదక్జిల్లా డెవలప్మెంట్మీటింగ్తనకు కనీస సమాచారం లేదన్నారు. ’’ అధికార మీటింగ్సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలో అందరి పోటీలు పెట్టి, నా పోటో పెట్టడం లేదు. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో జరిగే ప్రతి అధికారక కార్యక్రమానికి నన్ను పిలుస్తున్నారు. కానీ మెదక్జిల్లా కలెక్టర్, ఆఫీసర్లు ప్రోటోకాల్ పాటించడం లేదు. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. ఇక ముందు జరగకుండా చూసుకోవాలని బక్కి వెంకటయ్య(Bakki Venkataiah) ఆవేదన వ్యక్తం చేశారు.
Also read :
KTR : కేటీఆర్ కు తీవ్ర అస్వస్థత

