Kavitha : సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కవితకు (Kavitha)మరో షాక్ తగిలింది. తీహార్ జైల్లో ఉన్న కవితను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇస్తూ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను(Kavitha) నిందితురాలిగా పేర్కొంటూ 11 పేజీలో కస్టడీ అప్లికేషన్ ను సీబీఐ కోర్టులో దాఖలు చేసింది. అందులో కీలక అంశాలను ప్రస్తావించింది. మొత్తం వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ సూత్రదారి, పాత్రదారులుగా ఉన్నారని తెలిపింది. ఈ వ్యవహారం అంతా వీళ్లిద్దరి కను సన్నల్లోనే జరిగిందని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఇరు పక్షాల వాదనలు నమోదు చేసుకున్న న్యాయస్థానం ఈ నెల 15వ తేదీ వరకు కవితకు కస్టడీ విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో మూడు రోజులపాటు కవిత సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. అంతకు ముందు ఎమ్మెల్సీ కవితకు రౌస్‌ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన రెండు పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. తనను సీబీఐ ప్రశ్నించడానికి సవాల్‌ చేస్తూ కవిత పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అలాగే సీబీఐ అరెస్టు చేయటాన్ని సవాల్‌ చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై వాదనలు విన్న కోర్టు వాటిని కొట్టేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.

తప్పుడు కేసు: కవిత
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసే తప్పుడు కేసని, తాను చెప్పేందుకు ఏమీ లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇవాళ మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టుకు వస్తుండగా మీడియా ప్రశ్నించగా ఆమె ఇలా సమాధానమిచ్చి ముందుకు వెళ్లిపోయారు.

 

Also read :

Telangana Jagruthi : తెలంగాణ జాగృతికి రూ. 80 లక్షలు

Krishna River :కృష్ణా జలాల్లో తేలిన తాగునీటి లెక్క