చాయ్ (Chai) తాగాడానికి వచ్చి పుస్తెల తాడును గుర్తు తెలియని దుండగులు దోసుకుపోయారు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని పాలెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో ఉన్న ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై కొత్త కాపు జగదీశ్వర్ రెడ్డి స్మాల్ టీ (Chai) దాబాను నడుపుతున్నాడు. అతడు పనిమీద బయటికి వెళ్లడంతో ఆయన భార్య శ్రీదేవి కౌంటర్ క్యాష్ పై కూర్చున్నది. ఈ సమయంలో రెడ్ కలర్ బైక్ పై ఇద్దరు దుండగులు వచ్చి చాయ్ ఆర్డర్ చేసి తాగారు. అనంతరం బిల్లు కట్టేందుకు కౌంటర్ దగ్గరికి వెళ్లి శ్రీదేవిని మాటల్లో దించారు. చాయ్బిల్లు ఇచ్చిన అనంతరం ఆమె మెడలో ఉన్న3.5తులాల బంగారం గొలుసును లాక్కొని పరారయ్యారు. ఆమె కేకలు వేయడంతో దుండగులను స్థానికులు వెంబడించినా హైవే పై పారిపోయారు.
Also read:

