గొలుసు దొంగలు రెచ్చిపోయారు. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళా ఎంపీ(Sudha Ramakrishnan) మెడలోని చైన్ లాక్కెళ్లారు. ఈ ఘటన అత్యంత భద్రత ఉండే దేశ రాజధాని నగరం ఢిల్లీలో చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుధా రామకృష్ణన్ ఇవాళ ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. మహిళా ఎంపీ(Sudha Ramakrishnan) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:

