యువ హీరో రోషన్ (Roshan)మేక నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’.ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.ట్రైలర్ రిలీజయ్యాక సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.సోషల్ మీడియాలో ‘ఛాంపియన్’ ట్రైలర్ హాట్ టాపిక్‌గా మారింది.వైజయంతి మూవీస్ బ్యానర్‌పై భారీ పెట్టుబడితో ఈ చిత్రాన్ని నిర్మించారు.నిర్మాణ విలువల విషయంలో ఎలాంటి రాజీ పడలేదని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన (Roshan) రోషన్ మేక, ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపిస్తున్నాడు.సీనియర్ నటుడు శ్రీకాంత్ మేక వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోషన్‌కు ఇది కీలకమైన సినిమా అని చెప్పాలి.ఈ సినిమాలో అతడి నటనలో స్పష్టమైన మెచ్యూరిటీ కనిపిస్తోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
1948 నేపథ్యంతో సాగే కథ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.స్వాతంత్య్రానికి ముందు నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్ర పరిస్థితులను ఈ సినిమా ప్రతిబింబిస్తోంది.రజాకార్ల దౌర్జన్యాలు.ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు.
బైరాన్‌పల్లి గ్రామ నేపథ్యం.ఈ అన్నింటినీ కలిపి దర్శకుడు బలమైన కథను చెప్పినట్లు ట్రైలర్ సూచిస్తోంది.ఈ పరిస్థితుల్లో ఎదిగిన ఓ యువకుడు ఫుట్‌బాల్ ఛాంపియన్‌గా ఎలా మారాడన్నదే కథాంశం.స్పోర్ట్స్ డ్రామాతో పాటు బలమైన ఎమోషన్ కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.గ్రాండ్ విజువల్స్ సినిమాకు అదనపు బలంగా నిలుస్తున్నాయి.
మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటిస్తోంది.రోషన్ మేక – అనస్వర రాజన్ మధ్య కెమిస్ట్రీ సహజంగా వర్కౌట్ అయిందని ట్రైలర్లోనే అర్థమవుతోంది.ఇది కథకు మరింత బలాన్ని ఇస్తోంది.సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రాణం పోసింది.ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందన పొందాయి.ట్రైలర్లో వినిపించే మ్యూజిక్ సినిమాపై హైప్‌ను రెట్టింపు చేసింది.
ట్రైలర్లో కోవై సరళ, సీనియర్ హీరో నరేష్ కీలక పాత్రల్లో కనిపించారు.నందమూరి కల్యాణ్ చక్రవర్తి రాజారెడ్డి పాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.వెన్నెల కిషోర్, నిరీక్షణ ఈశ్వరీతో పాటు ఇతర నటులకు కూడా బలమైన పాత్రలు ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ యాసలో రోషన్ చెప్పిన డైలాగ్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించినట్లు కనిపిస్తున్నాయి.విజువల్స్, ఎమోషన్, స్పోర్ట్స్ ఎలిమెంట్ అన్నీ కలిసిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతుందనే నమ్మకం ట్రైలర్ ఇస్తోంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆయన రోషన్ మేకపై ప్రశంసలు కురిపించారు.పోస్టర్లో రోషన్‌ను చూస్తే యూరోపియన్ యాక్షన్ హీరోలా ఉన్నాడని అన్నారు.తన కెరీర్లో ‘మగధీర’ ఎంత కీలకమో, రోషన్‌కు ‘ఛాంపియన్’ కూడా అంతే ముఖ్యమైన సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
చరణ్ మాటలతో ‘ఛాంపియన్’పై అంచనాలు మరింత పెరిగాయి.మొత్తానికి ట్రైలర్ చూస్తే రోషన్ మేక హిట్ కొట్టేలా ఉన్నాడని చెప్పక తప్పదు.
Also read:

