ఐఫోన్–17 విడుదల సందర్భంగా (Mumbai) ముంబైలో హడావుడి వాతావరణం నెలకొంది.బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉదయం 5 గంటల నుంచే భారీ క్యూలు మొదలయ్యాయి.(Mumbai) క్యూలు కట్ చేయడానికి కొందరు ప్రయత్నించడంతో ఘర్షణకు దారితీసింది.పీటీఐ రిలీజ్ చేసిన వీడియోలో డజన్లకొద్దీ మంది ఒకరిపై ఒకరు తోసుకోవడం, కొట్టుకోవడం స్పష్టంగా కనిపించింది.ఒక వ్యక్తిని భద్రతా సిబ్బంది బయటకు లాగగా, అతడు వారిపైనే దాడి చేయడానికి ప్రయత్నించాడు. మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
కొనుగోలు దారుల అసంతృప్తి
తగినంత భద్రత లేకపోవడమే ఈ గందరగోళానికి కారణమని పలువురు విమర్శించారు.
“ఉదయం 5 గంటల నుంచే నిలబడ్డాం. కానీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. లైన్ కట్ చేసి ముందుకు వెళ్లేవారిని అడ్డుకోవడంలేదు” అని అహ్మదాబాద్ నుంచి వచ్చిన మోహన్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా అదే దృశ్యం
ఢిల్లీలోని సాకేత్ సెలెక్ట్ సిటీ వాక్ మాల్,బెంగళూరులోని యాపిల్ స్టోర్స్ వద్ద కూడా ఇదే పరిస్థితి.
కొందరు రాత్రంతా బయట క్యూలో నిలబడి ఉదయం దుకాణం తెరచగానే ఐఫోన్ 17 కొనుగోలు చేశారు.
ఐఫోన్–17 సిరీస్ ప్రత్యేకతలు
గత వారం విడుదలైన ఈ సిరీస్‌లో:
ఐఫోన్ 17 ప్రో,ప్రో మాక్స్,
రెగ్యులర్ ఐఫోన్ 17,కొత్త ఐఫోన్ ఎయిర్ మోడల్ ఉన్నాయి.
ముఖ్య ఫీచర్లు:
పెద్ద బ్యాటరీ,అల్యూమినియం బాడీ,వెనుక భాగమంతా ఆక్రమించే కెమెరా ప్లాటో.
ఐ ఫోన్ 17 కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు కొట్టుకున్నారు.. చొక్కాలు చించుకున్నారు..ఇవాళ రిలీజ్ కానుండటంతో ముంబై బాంద్ర కుర్లా కాంప్లెక్స్ వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఉదయం 5 గంటలకే క్యూలైన్ మొదలైంది. క్యూలు కట్ చేసేందుకు కొందరు ప్రయత్నించడంతో ఘర్షణకు దారితీసింది. పీటీఐ రిలీజ్ చేసిన ఓ వీడియోలో డజన్ల కొద్దీ మంది ఒకరిపై ఒకరు తోసుకోవడం, కొట్టుకోవడం స్పష్టంగా కనిపించింది. ఒక వ్యక్తిని భద్రతా సిబ్బంది లాగి బయటకు తీస్తుండగా అతడు వారినే దాడి చేయడానికి యత్నించాడు. మరో వ్యక్తిని కూడా భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తగినంత భద్రత లేకపోవడమే ఈ హడావుడికి కారణమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉదయం 5 గంటల నుంచే క్యూలో నిలబడ్డాను. కానీ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎవరైనా లైన్ బ్రేక్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నారు. మాకు ఐఫోన్ కొనుగోలు చేసే అవకాశం దక్కడం లేదు’ అని అహ్మదాబాద్ నుంచి వచ్చిన మోహన్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సాకేత్ సెలెక్ట్ సిటీ వాక్ మాల్, బెంగళూరులోని యాపిల్ స్టోర్ల వద్ద కూడా ఇలాగే భారీ క్యూ కనిపించింది. కొంతమంది రాత్రంతా బయట వేచి నిలబడి ఉదయం దుకాణం తెరచగానే ఐఫోన్ 17 కొనుగోలు చేశారు. గత వారం విడుదలైన ఐఫోన్ 17 సిరీస్లో ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్, రెగ్యులర్ ఐఫోన్ 17, కొత్త ఐఫోన్ ఎయిర్ మోడళ్లు ఉన్నాయి. యాపిల్ ఈ సిరీస్‌లో ఇప్పటివరకు పెద్ద బ్యాటరీ, అల్యూమినియం బాడీతో పాటు వెనుక భాగమంతా ఆక్రమించే కెమెరా ప్లాటోను ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది.
Also read: