ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన చాట్‌బాట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఓపెన్‌ఏఐకు చెందిన చాట్‌జీపీటీ (ChatGPT down)సేవలు అకస్మాత్తుగా పనిచేయకపోవడంతో లక్షలాది మంది యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గురువారం మధ్యాహ్నం నుంచి చాట్‌జీపీటీకి సంబంధించి వెబ్‌సైట్ లోడ్ అవ్వకపోవడం, చాట్ హిస్టరీ కనిపించకపోవడం, సర్వర్ ఎర్రర్లు వంటి సమస్యలు ప్రారంభమయ్యాయి. చాలామంది యూజర్లు “Something went wrong” అనే మెసేజ్‌లు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమస్యలు మొబైల్ యాప్ మరియు డెస్క్‌టాప్ వెర్షన్ రెండింటిలోనూ కనిపిస్తున్నాయి.(ChatGPT down)
ఇటీవల కాలంలో చాట్‌జీపీటీపై ఆధారపడుతున్న విద్యార్థులు, డెవలపర్లు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు ఇలా అన్నివర్గాలకూ ఈ సేవలు అవసరమవుతున్నాయి. కానీ సేవలు పూర్తిగా ఆగిపోవడంతో వారు ఇబ్బందులకు గురయ్యారు.
ఈ సమస్యపై డౌన్‌డిటెక్టర్ వంటి సైట్‌లు భారీ సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయని వెల్లడించాయి. వాటి ప్రకారం, భారత్, ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో అత్యధికంగా ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. అందులో 82% మంది యూజర్లు సర్వీసులు పొందలేకపోతున్నట్లు నివేదించారు.
ఇందుకు సంబంధించిన ఫిర్యాదులు ట్విటర్, రెడిట్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై విస్తృతంగా ట్రెండ్ అయ్యాయి. కొందరు యూజర్లు తమ అసహనాన్ని హాస్యంగా షేర్ చేస్తుంటే, మరికొందరు తమ పనులపై ప్రభావం చూపిన విషయాన్ని ప్రస్తావించారు.
ఈ క్రమంలో ఓపెన్‌ఏఐ సంస్థ అధికారికంగా స్పందించింది. తాము సమస్యను గుర్తించామని, ప్రస్తుతం సాంకేతిక బృందం పరిష్కారంపై పనిచేస్తోందని పేర్కొంది. ఈ సమస్య చాట్‌జీపీటీ మాత్రమే కాకుండా, సోరా, కోడెక్స్, రికార్డ్ మోడ్ వంటి ఇతర సేవలపైనా ప్రభావం చూపినట్లు సంస్థ వెల్లడించింది.
గమనించదగిన విషయమేంటంటే, ఈ నెలలోనే ఇది రెండోసారి చాట్‌జీపీటీ సేవలు డౌన్ కావడం. వినియోగదారులపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, సంస్థ ఇకపై మరింత స్థిరత కలిగిన సేవలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
Also Read :