Chhattisgarh : రహదారిని దిగ్బంధించిన మావోయిస్టులు

ఛత్తీస్ గఢ్​ (Chhattisgarh) రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా చిందనార్ –తుమ్రిగుండ రహదారిని మావోయిస్టులు ఇవాళ దిగ్బంధించారు. ఛిందనార్ క్యాంపు నుంచి పహుర్నార్ చౌక్, ఛోటే కర్కా, చెర్పాల్, తుమ్రిగుండ వరకు పలు చోట్ల మావోయిస్టులు రాళ్లు, బ్యానర్లు, పోస్టర్లు వేసి రోడ్డును దిగ్బంధించారు. దీంతో బర్సూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, చిద్నార్ సిఆర్‌పిఎఫ్ భద్రతా బలగాల బృందం రోడ్డును పునరుద్ధరించే పనిని చేపట్టారు.
బీజేపీ సర్కారుదే బాధ్యత
రాష్ట్రంలో జరుగుతున్న ఆదివాసీల హత్యలకు బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని మావోయిస్టులు పోస్టర్లలో పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు లోక్ సభ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కాదని వ్యవహరిస్తే కిరాతకంగా హత్య చేస్తామంటూ పేర్కొన్నారు.

 

Also read :

Kanna rao : కేసీఆర్ అన్న కొడుకు పై కిడ్నాప్ కేసు

Kishan Reddy : కేసీఆర్ నన్ను అనరాని మాటలన్నడు