Drinking water: తాగు నీటి సమస్యకు 1916తో చెక్​

గ్రామీణ తాగునీటి(Drinking water) సమస్య ఫిర్యాదుల కోసం కాంగ్రెస్​సర్కార్​ నాలుగు అంకెల టోల్ ఫ్రీ నంబ‌ర్ ఏర్పాటుచేసింది. సీఎం, మంత్రి సీత‌క్క ఆదేశాల మేర‌కు 11-అంకెల టోల్ ఫ్రీ నంబర్ స్థానంలో 1916 నంబర్​ అందుబాటులో తీసుకవచ్చింది. గతంలో మిషన్ భగీరథ శాఖలో ప్రజల గ్రామీణ తాగునీటి సమస్య ఫిర్యాదులను పరిష్కరించడానికి 1800-599-4007 (11-అంకెల) టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. ఈసేవలను (Drinking water) రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజ‌ల‌కు సులువుగా గుర్తుండేలా 11-అంకెల టోల్ ఫ్రీ నంబర్ కు బదులుగా నాలుగు అంకెల 1916 (4-అంకెల) నంబర్ తో ఫిర్యాదులను నమోదు చేసుకునే సౌకర్యం కల్పించింది. దీని ద్వారా ప్రజలు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా తమ తాగునీటి సమస్య ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.

Also Read :