చెన్నై(Chennai) తమిళనాడులో ఓ అభ్యర్థి కి ఎస్‌బీఐలో CBO (Circle Based Officer) ఉద్యోగం ఇచ్చారు. అయితే అతడి సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటంతో, బ్యాంక్ ఉద్యోగాన్ని రద్దు చేసింది. దీనిపై అభ్యర్థి (Chennai) చెన్నై హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు కూడా ఎస్‌బీఐ నిర్ణయానికే మద్దతు తెలిపింది.
ఆర్థిక క్రమశిక్షణ లేని వారు ప్రజాధనాన్ని ఎలా నిర్వహిస్తారు?
ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “బ్యాంకుల్లో పనిచేసే వ్యక్తులు ప్రజల డబ్బును నిర్వహించే బాధ్యత గలవారు. అలాంటి వారిలో ఆర్థిక క్రమశిక్షణ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒకరి సిబిల్ స్కోర్ తక్కువగా ఉందంటే, ఆ వ్యక్తి ఫైనాన్షియల్ లైఫ్‌లో అసంతులనం ఉందని అర్థం. అలాంటి వారిపై పూర్తి నమ్మకం పెట్టడం కష్టమే,” అని పేర్కొంది.
బ్యాంక్ నిబంధనల ప్రకారం చర్య:
అభ్యర్థి వాదన ప్రకారం – అతడు ఉద్యోగానికి ఎంపికైన తర్వాతే తన సిబిల్ స్కోర్ వివరాలు సమర్పించారని తెలిపాడు. కానీ ఎస్‌బీఐ అభ్యర్థికి ఆ ఉద్యోగ బాధ్యతలు అప్పగించేముందే అన్ని అంశాలు పరిశీలించాల్సిన అవసరం ఉందని కోర్టు తేల్చిచెప్పింది. జాబ్ నోటిఫికేషన్‌లో ఫైనాన్షియల్ క్రెడిట్ హిస్టరీపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని గుర్తుచేసింది.
ఈ తీర్పుతో భవిష్యత్ అభ్యర్థులకు హెచ్చరిక:
ఈ తీర్పు అనేక బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లో ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులకు మూల్యమైన సందేశాన్ని అందిస్తోంది. తమ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంచుకోవడం ఉద్యోగ అవకాశాల్లో కీలకమవుతుందని చెప్పకనే చెబుతోంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉద్యోగ నియామకాల సమయంలో ప్రైవేట్ క్రెడిట్ ప్రమాణాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చనే తీర్పు ఇది.
తమిళనాడులో ఓ వ్యక్తికి ఇచ్చిన CB0 ఉద్యోగాన్ని సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని SBI రద్దు చేసింది. దీనిపై అతడు చెన్నై హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు కూడా బ్యాంకునే సమర్థించింది. ‘ప్రజాధనం నిర్వహించా వ్యక్తికి ఆర్థిక క్రమశిక్షణ అవసరం. సిజిల్ స్కోర్ తక్కువగా ఉన్నవారిపై నమ్మకం ఎలా కలుగుతుంది? ఈ విషయంలో ఎస్బీఐ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం. జాబ్ దరఖాస్తు నిబంధనల్లోనే ఇవన్నీ స్పష్టంగా ‘ఉన్నాయి’ అని పేర్కొంది.
Also read:

