మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేపుతోంది. ఈ (Chiranjeevi) సినిమా నుండి ఇటీవల విడుదలైన ‘మీసాల పిల్ల’ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ పాట యూట్యూబ్‌ను ఊపేస్తూ, 30 మిలియన్ల వ్యూస్ సాధించింది.
యూట్యూబ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్ సాంగ్‌గా నిలిచిన “మీసాల పిల్ల” సాంగ్ అభిమానుల హృదయాలను కట్టిపడేస్తోంది. ఈ పాటకు అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. రొమాంటిక్, మాస్ టచ్‌తో కూడిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం మరింత హైలైట్‌గా నిలిచింది. ఉధిత్ నారాయణ్, శ్వేతా మోహన్ తమ మధుర స్వరాలతో పాటకు ప్రాణం పోశారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ రాసిన లిరిక్స్‌లో భావప్రదర్శన, రొమాన్స్, ఎనర్జీ మిళితమై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ సాంగ్ సోషల్ మీడియాలో సూపర్ హిట్ అవడంతో పాటు రీల్స్‌లో కూడా సునామీ రేపుతోంది. ఇప్పటికే 30 వేల రీల్స్ సృష్టించబడి, వాటి ద్వారా 300 మిలియన్ల వ్యూస్ సాధించాయి. అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్‌లలో ఈ పాటకు 50 మిలియన్లకు పైగా స్ట్రీమ్స్ నమోదవడం సంగీత ప్రియుల మద్దతుకు నిదర్శనం.
మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌పై అభిమానుల్లో ఉత్సాహం అధికంగా ఉంది. చిరంజీవి మరోసారి తన శైలి, ఎమోషన్, హాస్యం, మాస్ యాక్షన్ కలయికతో ప్రేక్షకులను అలరించబోతున్నారని సమాచారం. దర్శకుడు అనిల్ రావిపూడి తన స్పెషల్ ఎంటర్టైనింగ్ టచ్‌తో ఈ సినిమాను కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేయనున్నారని టాక్.
నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె మరియు చిరంజీవి కాంబినేషన్‌లో కనిపించనున్న రొమాంటిక్ సీన్లు ఇప్పటికే హైలైట్‌గా మారాయి. భీమ్స్ సంగీతం, అనిల్ రావిపూడి హాస్య డోస్, చిరంజీవి ఎనర్జీ కలయికతో ఈ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్‌ను దద్దరిల్లేలా చేయబోతుందని అభిమానులు నమ్ముతున్నారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ ఫైనల్ దశలో ఉండగా, సంక్రాంతి కానుకగా 2026 జనవరిలో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. మీసాల పిల్ల సాంగ్ ద్వారా ఇప్పటికే సినిమా బజ్ మరింత పెరిగింది.
Also read:
- Google: ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ‘విల్లో చిప్’ క్వాంటమ్
- Special trains: పండగ రద్దీకి ప్రత్యేక రైళ్లు

