Chiru :లండన్, పారిస్ లో చిరు ఫ్యామిలీ

ఫ్యాషన్ రాజధాని పారిస్ లో మెగాస్టార్ చిరంజీవి(Chiru) కుటుంబం సందడి చేస్తోంది. పారిస్ ​ఒలింపిక్స్ ​2024 ప్రారంభ వేడుకలకు రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి అటెండయ్యాడు. అంతకుముందు లండన్​లో వారు దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో ఆర్సీ షేర్ చేశాడు. అందులో అతను గాగుల్స్, వైట్ క్యాప్, గ్రీన్ జాకెట్ తో స్టైలిష్ గా కనిపించాడు. చిరంజీవి, సురేఖ కొణిదెల లండన్ వీధులను వీక్షిస్తున్న వీడియోను ఉపాసన కొణిదెల తన ఇన్ స్టాలో షేర్ చేశారు. సురేఖ, చిరంజీవి(Chiru) బ్లాక్ డ్రెస్ ధరించి ఆకాశహర్మ్యాలను, గ్రీనరీని చూస్తూ ఎంజయ్ చేస్తున్నారు. తాను పారిస్‌లో రామ్ తో కలిసి దిగిన సెల్ఫీని కూడా ఉపాసన షేర్ చేసింది. చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో తన భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లీంకారా కొణిదెలతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. “పారిస్‌కు వెళ్లే మార్గంలో లండన్‌లోని హైడ్ పార్క్‌లో కుటుంబం, గ్రాండ్ లిటిల్ వన్ క్లీంకారాతో ఈ ప్రశాంతమైన క్షణాన్ని ఆస్వాదిస్తున్నా! అని పేర్కొన్నారు.

ALSO READ :