జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఫరియా అబ్దుల్లా(Fariya Abdulla). తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ అమ్మడు.. మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

జాతిరత్నాలు సినిమా భారీ విజయం సాధించడంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. హైదరాబాద్ కు చెందిన ఈ బ్యూటీ.. తొలుత యూట్యూబర్‌గా పరిచమైంది. మాస్ మహారాజ్ రవితేజతో రావాణాసురలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది ఫరియా.

అయితే ఈ సినిమాతో ఆశించినంతగా రాణించలేకపోవడంతో ఫరియాకు సైతం ఊహించినంత క్రేజ్ రాలేదు. కేవలం హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్ ల్లోనూ ఫరియా నటించింది.నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించిన ‘బంగార్రాజు’ సినిమాలో ఐటెం సాంగ్ చేసి అందరిని ఫిదా చేసింది. ఈ సాంగ్ కు సినీ అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఫరియా.. బాగా సందడి చేస్తుంటుంది. తన లేటెస్ట్ అప్ డేట్స్ ను ఫ్యాన్ తో పంచుకుంటుంది. తాజాగా లెహంగాలో ఈ బ్యూటీ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్‌లో ఫరియా అబ్దుల్లా(Fariya Abdulla) యాక్ట్ చేస్తోందని సమాచారం.

Also read :

