Bengaluru: పాపం బెంగళూరు!!

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. అసలే నీళ్ల సమస్యతో బాధపడుతున్న బెంగళూరును (Bengaluru) ఇప్పుడు డయేరియా, కలరా పట్టి పీడిస్తున్నాయి. ఒకప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా వ్యాపించే ఈ సమస్య ఇప్పుడు సమ్మర్‌లోనూ భయపెడుతోంది. వాతావరణ మార్పుల కారణంగానే డయేరియా, కలరవ్యాప్తి చెందుతుంది. క్లీన్ సిటీగా పేరున్న బెంగళూరులో (Bengaluru) కలరా నేడు వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే చాలా మంది వాంతులు, విరేచనాల బారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. దీంతో అలెర్ట్ అయిన ఆరోగ్య శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పెరిగిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌ని అలానే వదిలేస్తే ప్రాణాంతకరమవుతుంది. ఇది ప్రధానంగా కలుషితమైన నీరు ఆహారం ద్వారా వ్యాపిస్తోంది. అతిసారం, వాంతులు మొదలైన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇంతకు ముందు ఆఫ్రికా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కనిపించే ఈ సమస్య బెంగళూరుకి పాకింది.
కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల కలరా వస్తుంది. ఈ సమస్య కారణంగా బ్యాక్టీరియా చిన్న పేగుల్లో ప్రవేశించి విరోచనాలు, వాంతులకి కారణమవుతుంది.

కలరా ఎలా వస్తుంది అంటే..
ప్రస్తుతం నీటి సమస్యలతో బాధపడుతున్నారు. దీని వల్ల చాలా మంది అపరిశుభ్రమైన నీటినే తీసుకుంటున్నారు. దీంతో పాటు అపరిశుభ్రమైన రోడ్డు పక్కన ఫుడ్ తీసుకోవడం, ఇమ్యూనిటీ తగ్గడం, పరిశుభ్రత పాటించకపోవడం దీనికి కారణం. కలరా ఉన్న వ్యక్తులు సరిగ్గా చేతులు కడుక్కోకుండా మరొకరికి షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల వ్యాధి వ్యాప్తి చెందుతోంది.
అతిసారం ఉంటే..బీపి తగ్గడం,
నీరసం, హార్ట్ బీట్ పెరగడం
కండరాల తిమ్మిరి లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కలరా బ్యాక్టీరియా బాడీలోకి ప్రవేశించిన తర్వాత దాని లక్షణాలు కనిపించడానికి దాదాపు 14, 16 రోజులు పడుతుంది. ఈ సమయంలో పైన లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కలవడం మంచిది.

ఈ సమస్య రాకుండా ఉండాలంటే..
ఈ సమస్య రాకుండా ఉండాలంటే పరిశుభ్రత పాటించాలి.
టాయిలెట్‌కి వెళ్ళిన ప్రతిసారి చేతులు కడుక్కోవాలి.
స్వచ్ఛమైన నీరు, ఆహారం తీసుకోవాలి. నీటిని మరిగించి తాగాలని, అల్లం, తులసి కలిపిన నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also read: