Jani master: గోవాలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్

Jani

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న సినీ కొరియోగ్రాఫర్‌ (Jani master) జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీబాషాను పోలీసులు ఇవాళ అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది. అక్కడి కోర్టులో హాజరు పరిచి పీటీ వారెంట్ పై నగరానికి తీసుకొస్తున్నారు. నేరుగా ఉప్పరపల్లి కోర్టులో తీసుకొచ్చే అవకాశం ఉంది. తనపై పలుమార్లు లైంగికదాడి చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ (21) ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నార్సింగి ఠాణాకు కేసును బదిలీ చేశారు. ఐదు రోజుల క్రితం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా.. అప్పటి నుంచి జానీ పరారీలో ఉన్నాడు.

Image

తనను లైంగికంగా చిత్రహింసలకు గురి చేశాడని బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘2017లో  (Jani master) జానీ మాస్టర్‌ పరిచయమయ్యాడు. 2019లో అతని టీంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాను. ముంబైలో ఓ సినిమా షూటింగ్ కోం జానీతో పాటు నేనూ మరో ఇద్దరు వెళ్లాం.. అక్కడ హోటల్‌లో నాపై జానీ లైంగికదాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, ఇండస్ట్రీలో ఎప్పటికీ పనిచేయలేవని బెదిరించాడు. ఇదే అదనుగా హైదరాబాద్ తో పాటు సినిమా షూటింగ్ ల కోసం వెళ్లిన సమయంలో అనేక మార్లు లైంగికదాడి చేశాడు. వాంఛ తీర్చనందుకు ఒకసారి జుట్టు పట్టుకుని తలను అద్దానికి కొట్టాడు. Image

మతం మారి.. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. వేధింపులు భరించలేక ఆయన టీం నుంచి బయటకొచ్చేశాను. సొంతంగా పనిచేసుకోనివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రాకుండా ఇబ్బందిపెట్టాడు. ఆగస్టు 28న మా ఇంటి గుమ్మానికి గుర్తుతెలియని వ్యక్తులు ఓ పార్సిల్‌ వేలాడదీశారు. ‘మగబిడ్డకు అభినందనలు. కానీ జాగ్రత్తగా ఉండు అని అందులో రాసి ఉంది’’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.

Also read: