Choutuppal :రేవంత్ రెడ్డి లాంటి ఇంద్రజాలికున్ని ఎక్కడా చూడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్(Choutuppal), నకిరేకల్ లో జరిగిన పట్టభద్రుల ఎన్నికల సన్నాహాక సమావేశం లో ఆయన మాట్లాడారు. ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేస్తానని నిరుద్యోగులను మోసం చేసిండని మండిపడ్డారు. రుణమాఫీ, ధాన్యం బోనస్ విషయంలో మాట తప్పాడన్నారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ అంటూ అన్ని బోగస్ మాటలు మాట్లాడుతున్నాడని సీఎంపై ఫైర్ అయ్యారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేవుల్ల మీద ఒట్లు వేస్తూ రేవంత్ రెడ్డి పూటకో అబద్ధం అడుతున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి గోల్డ్ మెడలిస్ట్ అని, ఆయనను గెలిపిస్తే ప్రభుత్వంతో కొట్లాడుతాడన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్నఅబద్ధాలు ఆడే వ్యక్తి అని, అతనిపై అమ్మాయిలు పెట్టిన కేసులే పది దాకా ఉన్నాయన్నారు. గోల్డ్ మెడలిస్ట్ కావాలో లేక పచ్చి బ్లాక్ మెయిలర్ కావాలో నిర్ణయించుకోవాలన్నారు. .అతనను చేసేవి అన్ని లంగా పనులేనిన ఎద్దేవా చేశారు. జీవో 46ను రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామన్నారు.
ALSO READ :

