పండుగ పూట.. ఆబాలగోపాలం బొజ్జగణపయ్య సేవలో మునిగి తేలుతుంది. గణపయ్య లీలలు తెలిపేలా ఎన్నో (Cinema) సినిమాలు వచ్చాయి. ఎన్ని సినిమాలు వచ్చినా సముద్రాల రాఘవాచార్య తెరకెక్కించిన వినాయక చవితి సినిమాకు ఉన్న ఫాలోయింగ్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.
వినాయక చవితి
వినాయకుడి కథతో వచ్చిన తొలి (Cinema) సినిమా ‘వినాయక చవితి. సముద్రాల రాఘవాచార్య తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, జమున, కృష్ణకుమారి, గుమ్మడి, రాజనాల కీలక పాత్రలు పోషించారు. కె. గోపాలరావు నిర్మాతగా వ్యవహరించారు. 1957 ఆగస్టు 22న విడుదలై మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. వినాయక చతుర్ధి రోజున శ్రీకృష్ణుడు పాలలో చంద్రుడిని చూస్తాడు. దీంతో శమంతకమణిని దొంగిలించాడనే అపవాదు మిగులుతుంది. వినాయక వ్రతం చేసి, ఆ పఖ్యాతి నుంచి శ్రీకృష్ణుడు ఎలా బయటపడ్డాడనేది ఈ సినిమాలో చూపించారు.
భూకైలాస్
ఎన్టీఆర్, ఏఎన్నార్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘భూ కైలాస్’.1985 మార్చి 20న విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్ రావణుడిగా, ఏఎన్నార్ నారదుడిగా కనిపిస్తారు. గొప్ప శివభక్తుడు అయిన రావణుడు, తల్లి కోరిక మేరకు ఆత్మలింగాన్ని తెస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆత్మలింగం సాధించి అమరుడిగా మిగలాలని తపస్సు మొదలు పెడతాడు. ఆయన తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు రావణుడికి ఆత్మలింగాన్ని అందిస్తాడు. కానీ, ఎట్టిపరిస్థితుల్లోనూ నేల మీద పెట్టకూడదంటాడు. ఈ ఆత్మలింగంతో రావణుడు భూలోకాన్ని నాశనం చేస్తాడని భావించిన నారదుడు, ఎలాగైనా ఆత్మలింగాన్ని లంకకు చేరకుండా అడ్డుకోవాలని వినాయకుడి వేడుకుంటాడు. రావణుడు సంధ్యావందనం చేసే సమయంలో ఆత్మలింగాన్ని గోకర్ణం వద్ద నేల మీద పడేలా చేస్తాడు వినాయకుడు.
శ్రీ వినాయక విజయం
కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కృష్ణం రాజు, వాణిశ్రీ జంటగా నటించిన సినిమా శ్రీ వినాయక విజయం. 1979 డిసెంబరు 22న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఇందులో కృష్ణం రాజు, వాణిశ్రీ శివపార్వతుల పాత్రలు పోషించారు. శివ వ్రతాన్ని చేసేందుకు పార్వతీదేవి స్నానమాచరించాలని భావిస్తుంది. అప్పుడు పిండితో ఓ బాలుడిని తయారు చేసి, దానికి ప్రాణం పోస్తుంది. ఎవరినీ లోపలికి రాకుండా కాపలా ఉంచుతుంది. అదే సమయంలో శివుడు అక్కడికి వస్తాడు. ఎంతకీ లోపలికి అనుమతించకపోవడంతో బాలుడి తల ఖండిస్తాడు. పార్వతి బాలుడి మరణాన్ని తట్టుకోలేదు. ఎలాగైనా ప్రాణం పోయాలని కోరుకుంటుంది. అప్పుడు ఏనుగు తలను తీసుకొచ్చి బాలుడికి అమర్చడంతో పునర్జీవుడవుతాడు. ఆ బాలుడు గణనాథుడిగా మారి తొలి పూజలు అందుకుంటాడు. 
భూకైలాస్
ఎన్టీఆర్, ఏఎన్నార్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘భూ కైలాస్’.1985 మార్చి 20న విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్ రావణుడిగా, ఏఎన్నార్ నారదుడిగా కనిపిస్తారు. గొప్ప శివభక్తుడు అయిన రావణుడు, తల్లి కోరిక మేరకు ఆత్మలింగాన్ని తెస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆత్మలింగం సాధించి అమరుడిగా మిగలాలని తపస్సు మొదలు పెడతాడు. ఆయన తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు రావణుడికి ఆత్మలింగాన్ని అందిస్తాడు. కానీ, ఎట్టిపరిస్థితుల్లోనూ నేల మీద పెట్టకూడదంటాడు. ఈ ఆత్మలింగంతో రావణుడు భూలోకాన్ని నాశనం చేస్తాడని భావించిన నారదుడు,
ఎలాగైనా ఆత్మలింగాన్ని లంకకు చేరకుండా అడ్డుకోవాలని వినాయకుడి వేడుకుంటాడు. రావణుడు సంధ్యావందనం చేసే సమయంలో ఆత్మలింగాన్ని గోకర్ణం వద్ద నేల మీద పడేలా చేస్తాడు వినాయకుడు.
Also read:
Medigadda :అక్టోబర్ 17న కోర్టుకు రండి
NEET :పర్మినెంట్ అడ్రస్ ఉన్నోళ్లంతా లోకలే
