సద్గురుకు చెందిన ఇషా యోగా సెంటర్ కి సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. ఇషా ఫౌండేషన్ (Isha Foundation)పై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. కాగా ఇషా ఫౌండేషన్ (Isha Foundation)తన ఇద్దరు కుమార్తెలు నిర్భందించబడి, సన్యాసం తీసుకున్నారని ఓ వ్యక్తి మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. అనంతరం ఈ కేసు సుప్రీంకోర్టుకు బదిలీ అయింది. కేసు విచారణలో భాగంగా పిటిషనర్ కుమార్తెలు తాము స్వచ్ఛందంగానే అక్కడ ఉంటున్నామని, తమపై ఎలాంటి వేధింపులు లేవని వారు స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేసింది. కాగా కేసు విచారణలో భాగంగా ఇషా ఫౌండేషన్ (Isha Foundation)కు సంబంధించి అలందురై పోలీస్ స్టేషన్ లో గత 15 ఏళ్లలో 6 మిస్సింగ్, 7 సూసైడ్ కేసులు నమోదయ్యాయని తమిళనాడు పోలీసులు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. నమోదైన 6 మిస్సింగ్ కేసుల్లో 5 కేసులను వెనక్కి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. 6వ కేసుకు సంబంధించి విచారణ సాగుతోందని తప్పిపోయిన వ్యక్తిని ఇంకా గుర్తించలేదని తెలిపారు. 7 ఆత్మహత్య కేసులు నమోదుకాగా.. వాటిలో 2 కేసుల్లో ఫోరెన్సి్క్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రావల్సి ఉందన్నారు.
Also read :
Khammam:ఫేస్ బుక్ లో చూసి చైన్ స్నాచింగ్!
Minister Sitakka: 2 లక్షల రుణం లక్షా 40 వేలు మాఫీ

