Himachal Pradesh: హిమాచల్ లో క్లౌడ్ బరస్ట్

Himachal Pradesh

(Himachal Pradesh) హిమాచల్‌ ప్రదేశ్ ను క్లౌడ్ బరస్ట్ అతలాకుతలం చేసింది. భారీ వర్షాలకు పార్వతి నదిపై నిర్మించిన మలానా డ్యామ్‌ కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు నీరు పోటెత్తిత్తింది. ప్రవాహం ధాటికి నది ఒడ్డున నిర్మించిన ఓ భారీ భవనం పేకమేడలా కూలిపోయింది.( Himachal Pradesh) హిమాచల్ లో ఒకరు మృతి చెందారు.. 28 మంది గాయపడ్డారు. 19 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్​, బృందాలు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు, పోలీసులు, హోంగార్డుల టీమ్స్ గాలిస్తున్నాయి.Image
ఉత్తరాఖండ్ లో వరదలు
ఉత్తరాఖండ్ ను వరదలు ముంచెత్తాయి. నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో ఇండ్లు కూలిపోయాయి. కేదార్ నాథ్ లో 10 మంది మరనించారు. డెహ్రాడూన్, హల్ద్వాని, చమోలి జిల్లాల్లో నలుగురు గల్లంతయ్యారు. పలుచోట్ల ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. హరిద్వార్‌ ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి.Image కన్‌ఖాల్‌ పోలీస్టేషన్‌ నీట మునిగింది. భూపత్వాలా, హరిద్వార్‌, నయా హరిద్వార్‌, కన్‌ఖాల్‌, జవల్‌పుర్‌ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు ప్రారంభించాయి. కొండ ప్రాంతాల్లో రాళ్లు కూలిపోతున్న కారణంగా కేదార్‌నాథ్‌కు వెళ్లే 200 మంది ప్రయాణికులను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. Imageమార్గమధ్యంలో ఉన్న వారిని హెలికాప్టర్‌సాయంతో వెనక్కి తీసుకొచ్చారు. చార్‌ధామ్‌ యాత్ర కోసం నూతన రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు. డెహ్రాడూన్ లోని విపత్తు నివారణ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల గురించి ఆరా తీశారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు రానున్న ఐదు రోజులపాటు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.హిమాచల్ లో క్లౌడ్ బరస్ట్
హిమాచల్‌ ప్రదేశ్ ను క్లౌడ్ బరస్ట్ అతలాకుతలం చేసింది. భారీ వర్షాలకు పార్వతి నదిపై నిర్మించిన మలానా డ్యామ్‌ కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు నీరు పోటెత్తిత్తింది. ప్రవాహం ధాటికి నది ఒడ్డున నిర్మించిన ఓ భారీ భవనం పేకమేడలా కూలిపోయింది. హిమాచల్ లో ఒకరు మృతి చెందారు.. 28 మంది గాయపడ్డారు. 19 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్​, బృందాలు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు, పోలీసులు, హోంగార్డుల టీమ్స్ గాలిస్తున్నాయి.
ఉత్తరాఖండ్ లో వరదలు
ఉత్తరాఖండ్ ను వరదలు ముంచెత్తాయి. నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో ఇండ్లు కూలిపోయాయి. కేదార్ నాథ్ లో 10 మంది మరనించారు. డెహ్రాడూన్, హల్ద్వాని, చమోలి జిల్లాల్లో నలుగురు గల్లంతయ్యారు. పలుచోట్ల ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. హరిద్వార్‌ ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కన్‌ఖాల్‌ పోలీస్టేషన్‌ నీట మునిగింది. భూపత్వాలా, హరిద్వార్‌, నయా హరిద్వార్‌, కన్‌ఖాల్‌, జవల్‌పుర్‌ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు ప్రారంభించాయి. కొండ ప్రాంతాల్లో రాళ్లు కూలిపోతున్న కారణంగా కేదార్‌నాథ్‌కు వెళ్లే 200 మంది ప్రయాణికులను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. మార్గమధ్యంలో ఉన్న వారిని హెలికాప్టర్‌సాయంతో వెనక్కి తీసుకొచ్చారు. చార్‌ధామ్‌ యాత్ర కోసం నూతన రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు. డెహ్రాడూన్ లోని విపత్తు నివారణ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల గురించి ఆరా తీశారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు రానున్న ఐదు రోజులపాటు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

Also read: