KCR : 28న యాదాద్రికి సీఎం కేసీఆర్

KCR

KCR : యాదగిరి గుట్టకు సీఎం కేసీఆర్ దంపతులు సహా పలువురు ప్రముఖులు ఈ నెల 28న వెళ్లనున్నట్టు తెలిసింది. లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించే కల్యాణోత్సవం లో కేసీఆర్ దంపతులు పాల్గొననున్నారని సమాచారం. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సినీ నటుడు చిరంజీవి కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిసింది. ఈ పర్యటన ను అధికారికంగా ధ్రువీకరించలేదు.