హీరో( Venkatesh)వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి పేరు ఫిక్సయ్యింది. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ను చిత్రబృందం విడుదల చేసింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు ఖరారు చేసింది. 2025లో సంక్రాంతి పండుగకు దీనిని ప్రేక్షకుల ముందుకుతీసుకురానున్నట్లు తెలిపింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇవాళ విడుదల చేసిన పోస్టర్ లో పంచెకట్టుతో, భుజాన గన్ తో వెంకీ మామ లుక్ అదిరింది. ఇక ఆయన పక్కన, మోడరన్ డ్రెస్ లో మీనాక్షి, చీరకట్టులో ఐశ్వర్య ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్ లో ఏదో ఒక క్రైమ్ ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా గోడకి బోర్డు ఉంది. మొత్తానికి పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ సంక్రాంతి రేసులో ఉంది.
ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా పొంగల్ బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.
హీరో( Venkatesh)వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి పేరు ఫిక్సయ్యింది. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ను చిత్రబృందం విడుదల చేసింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు ఖరారు చేసింది. 2025లో సంక్రాంతి పండుగకు దీనిని ప్రేక్షకుల ముందుకుతీసుకురానున్నట్లు తెలిపింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇవాళ విడుదల చేసిన పోస్టర్ లో పంచెకట్టుతో, భుజాన గన్ తో వెంకీ మామ లుక్ అదిరింది.
ఇక ఆయన పక్కన, మోడరన్ డ్రెస్ లో మీనాక్షి, చీరకట్టులో ఐశ్వర్య ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్ లో ఏదో ఒక క్రైమ్ ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా గోడకి బోర్డు ఉంది. మొత్తానికి పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ సంక్రాంతి రేసులో ఉంది. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా పొంగల్ బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.
Also read:

