kashmir: కాశ్మీర్ లో కాంగ్రెస్ జెండా

కాశ్మీర్(kashmir) లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. హర్యానాలో మళ్లీ కమలం వికసించింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో చోట అధికారం చేజిక్కించుకుంది. హర్యానా ఎన్నికల ఫలితాలు టీ 20 మ్యాచ్ ను తలపించాయి. ఉదయం పోస్టల్ బ్యాలెట్ లో ముందున్నకాంగ్రెస్ పార్టీ, ఈవీఎం ఓట్ల లెక్కింపులో వెనుకడింది. ఇక్కడ ఎగ్జిట్ పోల్ అంచనాలు సైతం తారుమారయ్యాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలూ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పాయి. హర్యానా రిజల్ట్ భిన్నంగా ఉండటం గమనార్హం. నల్లచట్టాలపై కర్షకుల ఆందోళనలు ఇక్కడ ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు భావించారు. అందుకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అదే విధంగా ఢిల్లీ, పంజాబ్ లలో అధికారంలో ఉన్న ఆప్ కూడా హర్యానాలో ఎంట్రీ ఇస్తుందని భావించారు. అలా జరగలేదు. చీపురు పత్తా లేకుండా పోయింది.
కాశ్మీర్(kashmir) లో కాంగ్రెస్ హవా
జమ్మూకశ్మీర్‌ లో కాంగ్రెస్ కూటమి హవా కొనసాగుతోంది. ప్రస్తుతం జమ్మకశ్మీర్ కాంగ్రెస్ కూటమి 52 స్థానాల్లో ముందజలో ఉంది. ఇక, బీజేపీ 27 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 46ను క్రాస్ చేసింది. దీంతో కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఖాయమైపోయింది.

 

ముఫ్తీ కూతురు ఓటమి
కాశ్మీర్ లోని శ్రీగుఫ్వారా – బిజ్‌బెహరా నుంచి పోటీ చేసిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఓటమి పాలయ్యారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అభ్యర్థి బషీర్‌ అహ్మద్‌ చేతిలో ఓడిపోయారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్టు ఇల్తిజా ముఫ్తీ ఎక్స్ లో వెల్లడించారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

Also Read :