KTR: శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టో

శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టో: కేటీఆర్ విమర్శలు.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను “ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం”గా అభివర్ణించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), దళిత–గిరిజనులపై కాంగ్రెస్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు.
ఖర్గే సాక్షిగా చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలుపై ప్రశ్నలు వేస్తూ, “కాంగ్రెస్ దళిత వ్యతిరేక ప్రభుత్వం” అని ఎద్దేవా చేశారు.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలంలో జరిగిన ఆత్మగౌరవ గర్జన సభలో కేటీఆర్ మాట్లాడుతూ – (KTR)

  •  “హైదరాబాద్‌ నగరంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినది కేసీఆర్.”
  • “26 శాతం ఉన్న దళిత–గిరిజనులకు అండగా ఉండాలని మాటిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాట తప్పింది.”
  • “రెవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఉన్న 60,000 ఉద్యోగాలు ఏమయ్యాయి?”
  • “రాజధానిలో మిస్ వరల్డ్ అందగత్తెలకు లక్షల రూపాయల బోజనాలు పెట్టే వారు, వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్‌తో చనిపోతున్న దళిత విద్యార్థులపై దృష్టి పెట్టరా?”

“తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచే సత్తా లేని సీఎం అవసరం లేదు. కేసీఆర్ తిరిగి సీఎం కావాల్సిందే” అంటూ భావోద్వేగంతో ప్రసంగించారు.

Also Read :