BJP vs Congress : సోనియా–రాహుల్ కేసుపై కాంగ్రెస్ రోడ్డెక్కింది

bjp vs congress

నేషనల్ హెరాల్డ్ వ్యవహారం మరోసారి దేశ రాజకీయాలను వేడెక్కించింది.ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై తప్పుడు కేసులు పెట్టారని కాంగ్రెస్ పార్టీ(BJP vs Congress) ఆరోపిస్తోంది.ఈ నేపథ్యంలో బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కోర్టు ఈ కేసును కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ ఆందోళనకు దిగింది.బీజేపీ రాజకీయ కక్షతోనే ఈ కేసులు పెట్టిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ నిరసనలో భాగంగా హైదరాబాద్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Image

పీసీసీ పిలుపుతో గాంధీభవన్ నుంచి బీజేపీ (BJP vs Congress)కార్యాలయానికి ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. గాంధీభవన్, నాంపల్లి బీజేపీ కార్యాలయం పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో ర్యాలీ ప్రారంభమైంది. గాంధీభవన్ గేటు వద్దే పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులకు, మహిళా నేతలకు మధ్య తోపులాట జరిగింది.

Image

తమను అడ్డుకోవడంపై మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.
సునీతారావుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు.అరెస్ట్ సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Image

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సునీతారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.దేశంలో బీజేపీ రాజకీయంగా పనైపోయిందని ఆమె అన్నారు.అందుకే సోనియా, రాహుల్ గాంధీలపై తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపించారు.మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది.పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ర్యాలీకి సిద్ధమయ్యారు.ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

Image

గాంధీభవన్ నుంచి నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు.అయితే పోలీసులు ఈ ర్యాలీని కూడా అడ్డుకున్నారు.గాంధీభవన్ ప్రధాన గేట్లను మూసివేశారు.దీంతో కాంగ్రెస్ నేతలు అక్కడే బైఠాయించారు.పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ నిరసనకు దిగారు.ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను అణిచివేస్తోందని ఆరోపించారు.

Image

ఇదిలా ఉండగా కొందరు కాంగ్రెస్ నేతలు పోలీస్ అడ్డంకులను దాటుకుని బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు.
అప్పటికే బీజేపీ కార్యాలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలు అక్కడ మోహరించాయి.బీజేపీ కార్యాలయంలో ఉన్న కార్యకర్తలు కూడా బయటకు వచ్చారు.కర్రలు పట్టుకొని బారికేడ్లపైకి ఎక్కారు.కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఇరు పార్టీల కార్యకర్తల నినాదాలతో పరిసర ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.ఏ క్షణంలోనైనా ఘర్షణ జరిగే పరిస్థితి నెలకొంది.పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

Image

ఈ ఘటనతో హైదరాబాద్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.నేషనల్ హెరాల్డ్ కేసు దేశవ్యాప్తంగా కాంగ్రెస్–బీజేపీ మధ్య కొత్త రాజకీయ పోరుకు దారితీస్తోంది.రానున్న రోజుల్లో ఈ అంశం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also read:

Recharge: రీచార్జ్ ధరలు మళ్లీ పెరుగుతాయా?

Delhi: బ్లూ స్టిక్కర్ లేకుంటే నో ఎంట్రీ