Congress:కాంగ్రెస్ థర్డ్ లిస్ట్ రిలీజ్

Congress:కాంగ్రెస్ థర్డ్ లిస్ట్ రిలీజ్

ఢిల్లీ: కాంగ్రెస్ (Congress) పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల బరిలో దిగే 16 మంది అభ్యర్థుల తో కూడిన జాబితాను కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. మిర్యాలగూడ, తుంగతుర్తి, సూర్యాపేట, చార్మినార్ నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టింది. కొత్తగూడెం స్థానాన్ని సిపిఐ కేటాయించిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లా బోథ్, వనపర్తి స్థానాలకు అభ్యర్థులను మార్చింది. గతంలో వనపర్తి నుంచి చిన్నారెడ్డికి టికెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో తూడి మెగా రెడ్డిని కాంగ్రెస్ (Congress) పార్టీ అభ్యర్థిగా మార్పు చేస్తూ రిలీజ్ చేసింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ స్థానానికి గతంలో వన్నెల అశోక్ పేరును ప్రకటించింది. ఆస్థానంలో కూడా అభ్యర్థిని మార్పు చేసింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీ అభ్యర్థిగా గజేందర్ బరిలోకి దిగుతారని పేర్కొంది. కొత్తగా టికెట్లు పొందిన వారిలో ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి మాజీ ఎంపీ జీ వివేకానంద్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నీలం మధు ముదిరాజ్ ఉన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి బాన్సువాడ టికెట్ కేటాయించారు.  కామారెడ్డి నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలిపారు.

సెగ్మెంట్                        అభ్యర్థి పేరు
చెన్నూరు                      జీ వివేకానంద్
బోథ్                                   ఆదే గజేందర్
జుక్కల్                           టీ లక్ష్మీకాంతరావు
బాన్సువాడ                   ఏనుగు రవీందర్ రెడ్డి
కామారెడ్డి                        రేవంత్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్         షబ్బీర్ అలీ
కరీంనగర్పీ                    పీ శ్రీనివాస్
సిరిసిల్ల                           కె కె మహేందర్ రెడ్డి
నారాయణ ఖేడ్          సురేష్ షెట్కార్
పఠాన్ చెరు                  నీలం మధు
వనపర్తి                           తూడి మేఘారెడ్డి
డోర్నకల్                        జె రామచంద్రునాయక్
ఇల్లందు                        కోరం కనకయ్య
వైరా                                  రామ్ దాస్ మాలోత్
సత్తుపల్లె                       మట్టా రాగమయి
అశ్వారావుపేట          జే ఆది నారాయణ

Read More: