Indonesia :శవాల పండగ

ప్రపంచంలో ఒక్కో దేశంలో వివిధ ఆచారాలు, అనేక సంప్రదాయాలు ఉంటాయి. అయితే ఇండోనేషియ(indonesia)లో మాత్రం శవాలతో పండుగ చేసుకుంటారు. అక్కడ పాతిపెట్టిన శవాలను బయటకు తీసి వాటిని అందంగా అలంకరించి ముస్తాబు చేసి పూజలు చేస్తారు. ఈ వేడుకను మనెనే పండుగ అంటారు. దక్షిణ ఇండోనేషియా(indonesia)లోని సులవేసి ద్వీపంలోని టోరాజా తెగ ఒక విచిత్రమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. చనిపోయిన వారు ఇంకా బతికే ఉన్నారనే నమ్మకంతో వారి సంవత్సరీకం రోజున శవాలను గుంతలోంచి బయటకు తీసి స్నానం చేయించి శుభ్రం చేస్తారు. కొత్త బట్టలు ధరించి, సమాధులను శుభ్రం చేస్తారు. మృతదేహాలను అందంగా అలంకరింస్తారు. సంబంధాలను బలోపేతం చేయడానికి టోరోజా ప్రజలు వేల సంఖ్యలో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వేడుకలకు కలిసి వస్తారు. టోరోజా ప్రజల ఈ పురాతన ఆచారం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ వేడుకలను చూడడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళుతున్నారు. టోరోజా ప్రజలకు ఈ పండుగ చాలా ఆనందాన్ని ఇస్తుంది. మరణం అంతం కాదు. దేనికీ అంతం లేదు, అది శాశ్వతమని నమ్ముతారు. చనిపోవడం అంటే టోరోజా ప్రజలు గాయపడినట్లు భావిస్తారు. దీనిని మకులా అని పిలుస్తారు. అంటే గాయపడిన వ్యక్తి చనిపోయినా, ఆ వ్యక్తిని బతికున్నట్లుగానే వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం ఆగష్టు నెలలో, టోరోజా ప్రజలు వసంత మాసం చివరిలో మనెనే పండుగను జరుపుకుంటారు.

Also read :

Kangana : సినిమాలే చాలా ఈజీ

Arrest : కేజ్రీవాల్ పీఏ అరెస్ట్