పానీపూరీ (Pani puri)పేరు వినగానే చిన్నా,పెద్దా తేడా లేకుండా అందరికి నోరూరుతుంది. సాధారణంగా షాపుల్లో పానీపూరీ (Pani puri) ప్లేట్ రూ.20 లేదా -30కి దొరకుతుంది. ఒక ప్లేట్లో 6 నుంచి-8 పానీపూరీలు ఉంటాయి. అయితే ఓ ఎయిర్ పోర్ట్ లో మాత్రం ప్లేట్ పానీపూరీ తినాలంటే అక్షరాలా 333రూపాయలు చెల్లించాల్సిందే. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (సీఎస్ఐఎ)కు ప్రయాణ నిమిత్తం కౌశిక్ ముఖర్జీ అనే బిజినెస్‌మ్యాన్ వెళ్లాడు. అయితే అక్కడ కనిపించిన ఫుడ్‌స్టాల్స్‌లో పానీపూరీ ధరను చూసి షాక్ అయ్యాడు. వెంటనే దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌లో పానీ పూరీ, దహీ పూరీ, సేవ్ పూరీ వంటి ఫేమస్ స్నాక్స్ రేట్లను ప్రదర్శించారు. విమానాశ్రయంలో ఎనిమిది పీసుల పానీపూరీని ధర రూ. 333కు అమ్ముతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also read:

