రాష్ట్రంలో పత్తి రైతులకు శుభవార్త అందింది. పత్తి క్వింటాకు మద్దతు ధరను రూ.8,100గా నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి (Ponnam Prabhakar) పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో పత్తి దిగుబడి కొంత మేర తగ్గిందని (Ponnam Prabhakar) తెలిపారు.
రైతులు ఇకపై తమ పత్తిని అమ్మడానికి ‘కపాస్ కిసాన్’ మొబైల్ యాప్ ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చని మంత్రి సూచించారు. ఈ యాప్ ద్వారా రైతులు సమీపంలోని పత్తి కొనుగోలు కేంద్రాలను తెలుసుకుని ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని వివరించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొండాపూర్ సమీపంలో పత్తి కొనుగోలు కేంద్రం, హుస్నాబాద్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ అన్నారు — “కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా నిర్వహిస్తోంది. తెలంగాణలో మొదటి స్లాట్ కింద ఈరోజు నుంచే కొనుగోలు ప్రారంభించాం.”
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రి స్పష్టం చేశారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. రైతుల ఖాతాల్లో 48 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి,” అని చెప్పారు.
అలాగే నర్మెట్‌లో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సర్వం సిద్ధమైందని వెల్లడించారు. రైతులు లాభదాయకమైన పంటలను సాగు చేయాలని సూచించారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి పంట పొలాలకు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.
పొన్నం మాట్లాడుతూ —“రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి, డిజిటల్ సాంకేతికతను వినియోగించుకోవాలి. కపాస్ కిసాన్ యాప్ ద్వారా అమ్మకాలు పారదర్శకంగా జరుగుతాయి. దళారీల జోక్యం లేకుండా రైతులకు న్యాయమైన ధర లభిస్తుంది” అని పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొండాపూర్ సమీపంలో పత్తి కొనుగోలు కేంద్రం, హుస్నాబాద్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు
తూ పొన్నం ప్రభాకర్ అన్నారు —“కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా నిర్వహిస్తోంది. తెలంగాణలో మొదటి స్లాట్ కింద ఈరోజు నుంచే కొనుగోలు ప్రారంభించాం.”
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రి స్పష్టం చేశారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. రైతుల ఖాతాల్లో 48 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి,” అని చెప్పారు.
అలాగే నర్మెట్‌లో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సర్వం సిద్ధమైందని వెల్లడించారు. రైతులు లాభదాయకమైన పంటలను సాగు చేయాలని సూచించారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి పంట పొలాలకు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.
పొన్నం మాట్లాడుతూ — “రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి, డిజిటల్ సాంకేతికతను వినియోగించుకోవాలి. కపాస్ కిసాన్ యాప్ ద్వారా అమ్మకాలు పారదర్శకంగా జరుగుతాయి. దళారీల జోక్యం లేకుండా రైతులకు న్యాయమైన ధర లభిస్తుంది” అని పేర్కొన్నారు.
Also read:

