Counting: కౌంటింగ్ కు కౌంట్ డౌన్!

counting

లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు (Counting) కౌంట్ డౌన్ మొదలైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశ వ్యాప్తంగా 542 ఎంపీ స్థానాలకు కౌంటింగ్ జరగనుంది. సూరత్ స్థానానికి ఎన్నిక ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. తెలంగాణ లో 17 ఎంపీ స్థానాలకు 34 చోట్ల కౌంటింగ్ (Counting) ప్రక్రియ జరగనుంది. ఇందుకోసం 10 వేల మంది సిబ్బంది లెక్కింపు కేంద్రాలకు చేరుకున్నారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు లిక్కర్ షాపులను బంద్ చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ర్యాలీలపై నిషేధం విధించారు. అటు ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు సాగుతున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓట్ల లెక్కింపు సాగనుంది.

Also read: