Couple Sucide:దంపతుల ఆత్మహత్య

  • పురుగుల మందు తాగి బలవన్మరణం
  • ఆర్థిక ఇబ్బందులే కారణం
  • పెద్దపల్లి జిల్లా నెల్లిపల్లిలో విషాదం

పెద్దపల్లి: మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామపంచాయతీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. నెల్లిపల్లిలో దంపతులు(Couple) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డెడ్​బాడీలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులను కటుకు అశోక్ (33), సంగీత (30)గా (Couple)గుర్తించారు. వీరిద్దరికి ఆరేండ్ల క్రితం పెండ్లి కాగా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలిపని చేసుకుని జీవనం సాగిస్తున్న వీరు.. ఆర్థిక ఇబ్బందుల వల్లే సూసైడ్​చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More: