Court :సీఎం నిందితుడైతే కోర్టులెలా ప్రభావితమవుతాయి?

ఓటుకు నోటు కేసును హైదరాబాద్ హైకోర్టు(Court) నుంచి భోపాల్ కు ఎందుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘ముఖ్యమంత్రి నిందితుడిగా ఉంటే కోర్టులెలా ప్రభావితమవుతాయి..? దేశంలోని ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల కేసులు నమోదైతే విచారణ కోసం పాకిస్థాన్ కు పంపాలా..?’అంటూ ధర్మాసనం(Court) తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. ఇవాళ జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవి విశ్వనాథన్‌ బెంచ్.. ఓటుకు నోటు కేసును భోపాల్ కు మార్చాలంటూ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది. అసలు పిటిషన్ ఎందుకు బదిలీ చేయాలో చెప్పాలని సూచించింది. ప్రాసిక్యూట్‌ చేసే ఏజన్సీలు తమ అభిప్రాయం, వాదన మార్చుకునే అవకాశాలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆధారాలు తారుమారు చేయొచ్చని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని బెంచ్ కు తెలిపారు. అలా జరిగినట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్ పై ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కి రిజాయిండర్‌ వేసేందుకు తమకు రెండు వారాల సమయం కావాలని కోరగా మంజూరు చేస్తూ విచారణ వాయిదా వేసింది.

ALSO READ :