స్టార్ హీరోయిన్లు విద్యా బాలన్, ఇలియానా ప్రధాన పాత్రలో శిర్షా గుహ డైరెక్షన్లో వచ్చిన చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’.(DADP) పెళ్లి చేసుకున్న ఓ జంట.. గతంలో తాము వ్యవహారం నడిపిన ఇద్దరి వల్ల ఎలాంటి ఇబ్బందులు పడిందనే కాన్సెప్టుతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. దీనికితోడు ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. మంచి హైప్‌తో ‘దో ఔర్ దో ప్యార్’ మూవీ ఏప్రిల్ 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజైంది. ఆరంభంలోనే ఈ సినిమాకు మంచి టాక్ రాలేదు. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శననే కనబరించింది. ఫలితంగా డీసెంట్ కలెక్షన్లను కూడా సొంతం చేసుకుంది. తద్వారా చాలా కాలం తర్వాత ఇలియానాకు విజయాన్ని అందించింది. బోల్డు కంటెంట్‌తో రూపొందిన మూవీ కావడంతో పాటు విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో ‘దో ఔర్ దో ప్యార్'(DADP) డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల గట్టి పోటీనే ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. ఇందుకోసం మంచి మొత్తాన్నే నిర్మాతలకు అందినట్టు తెలుస్తోంది.
ALSO READ :

