dalitha bandhu:దళితబంధు రచ్చ.. సర్పంచ్ ఇంటికి తాళం

దళితబంధు  (dalitha bandhu)రచ్చ.. సర్పంచ్ ఇంటికి తాళం
– అక్రమాలపై మహిళల నిరసన
సూర్యాపేట: ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.   దళితబంధు (dalitha bandhu)లో అక్రమాలపై మహిళలు ఆందోళనకు దిగారు. సర్పంచ్, వార్డు మెంబర్ల ఇంటికి తాళాలు వేసి నిరసన తెలిపారు. దళిత బంధు (dalitha bandhu)పథకం యూనిట్లను సర్పంచ్, వార్డ్ మెంబర్లు, అంగన్వాడీలు పంచుకున్నారని ఆరోపించారు. అనంతరం సూర్యాపేట–-దంతాలపల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని శాంతింప చేసే ప్రయత్నం చేశారు. అయితే తమకు పూర్తిగా న్యాయం చేయాలని అక్కడికి వచ్చిన పోలీసుల కాళ్లపై పడి దళితులు వేడుకున్నారు.

More Read:

Palla Rajeshwar Reddy: పల్లా గో బ్యాక్​

Rahul Gandhi : దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణాలోనే ఉంది