Danam: కాంగ్రెస్ లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Danam

త్వరలోనే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్  పార్టీలో చేరబోతున్నారని బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం (Danam) నాగేందర్ చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ లో కేటీఆర్, హరీశ్, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రావు మాత్రమే మిగులుతారని అన్నారు. హరీశ్ రావు బీజేపీలో చేరబోతున్నారని చెప్పారు. ఆయనతో కొందరు ఎమ్మెల్యేలు వెళ్తారని (Danam)  అన్నారు. కేసీఆర్ అవలంబించిన విధానాలే బీఆర్ఎస్ ను ముంచాయని చెప్పారు. ఒక్క పోచారం శ్రీనివాస్ రెడ్డే కాదు చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్  లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారని తెలిపారు. గ్రేటర్ మొత్తం ఖాళీ అవుతుందని, కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ముఠాగోపాల్, సుధీర్ రెడ్డి, కేపీ వివేకానంద, ప్రకాశ్ గౌడ్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారని చెప్పారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రెండు, మూడు రోజులుగా సునీల్ కనుగోలు సీఎం రేవంత్ రెడ్డితో చేరికలపై చర్చిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ అయోమయంలో ఉందని, అందుకే ఆ పార్టీ నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నారని చెప్పారు.

కేసీఆర్ అవలంబించిన విధానాలే బీఆర్ఎస్ ను ముంచాయని చెప్పారు. ఒక్క పోచారం శ్రీనివాస్ రెడ్డే కాదు చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్  లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారని తెలిపారు. గ్రేటర్ మొత్తం ఖాళీ అవుతుందని, కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ముఠాగోపాల్, సుధీర్ రెడ్డి, కేపీ వివేకానంద, ప్రకాశ్ గౌడ్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారని చెప్పారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రెండు, మూడు రోజులుగా సునీల్ కనుగోలు సీఎం రేవంత్ రెడ్డితో చేరికలపై చర్చిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ అయోమయంలో ఉందని, అందుకే ఆ పార్టీ నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నారని చెప్పారు.

 

Also read: