Phone :తగ్గనున్న మొబైల్ ఫోన్ల ధరలు

మొబైల్ ఫోన్లు, మొబైల్(Phone) యాక్ససరీస్ ధరలు తగ్గనున్నాయి. ఇవాళ కేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో 15శాతం డ్యూటీ తగ్గించింది. దీంతో సెల్ ఫోన్ల(Phone) ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.

వెండి, బంగారం ధరలు డౌన్
కేంద్ర ప్రభుత్వం 20 రకాల ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గించింది. బంగారం, వెండిపై 6 శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది. దీంతో బంగారు ఆభరణాల ధరలు తగ్గనున్నాయి. వెండి వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి.

క్యాన్సర్ రోగులకు ఊరట
క్యాన్సర్ ట్రీట్ మెంట్ లో ఉపయోగించే మూడు మందులకు కస్టమ్ డ్యూటీని మినహాయిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో క్యాన్సర్ రోగులకు ఊరట లభించనుంది.

బడ్జెట్ హైలైట్స్
= ప్లాటినమ్‌పై 6.4 శాతాననికి కుదింపు
= అంకురాలు, ఆవిష్కరణల ప్రోత్సాహానికి కేంద్రం కీలక నిర్ణయం
= అన్ని తరగతుల పెట్టుబడిదారులపై ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు
= వృత్తి నిపుణులు విదేశాల్లో కలిగివున్న చరాస్తులపై సమాచారం ఇచ్చి తీరాలి.. లేకుంటే కఠిన చర్యలు
= గతేడాది రికార్డు స్థాయిలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు
= కస్టమ్స్‌ సుంకాల్లో మార్పులు
= ఆదాయపన్ను చెల్లింపుదార్లులో మూడింట రెండొంతుల మంది కొత్త విధానంలోకి వచ్చారు
= నూతన పింఛన్‌ విధానంలో త్వరలో మార్పులు
=సంప్రదింపుల కమిటీ సిఫార్సుల ఆధారంగా త్వరలో నిర్ణయం
= ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
= ఇతర దేశాల్లో భారత్‌ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
= వాణిజ్య అనుకూల విధానాలకు జన్‌ విశ్వాస్‌ బిల్లుతో మరిన్ని సంస్కరణలు.

ALSO READ :