DELHI LIQUOR SCAM:హైదరాబాద్ కేంద్రంగానే లిక్కర్ స్కాం

delhi liquor scam

ఢిల్లీ లిక్కర్ (DELHI LIQUOR SCAM) స్కాంలో సంచలన విషయాలు ఈడీ రిపోర్ట్ ద్వారా బయటపడ్డాయి. ఆప్ లీడర్ మనీష్ సిసోడియాను మార్చి 10వ తేదీ విచారించిన తర్వాత.. ఆయన రిమాండ్ రిపోర్టులో నమ్మలేని నిజాలను వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం (DELHI LIQUOR SCAM) మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందని.. ఐటీసీ కోహినూర్ హోటల్ లోనే చర్చలు జరిగాయని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది ఈడీ. దినేశ్​ అరోరాను హైదరాబాద్ పిలిపించిన సౌత్ గ్రూప్ సభ్యులు.. ఐటీసీ కోహినూర్ హోటల్ కేంద్రంగా డిస్కషన్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. చర్చల సమయంలో విజయ్ నాయర్, అర్జున్ పాండే, అభిషేక్, ఆడిటర్ బుచ్చిబాబు అందరూ కలిసే ఉన్నారని, ఎనిమిది గంటలపాటు వీరి సమావేశం జరిగిందని సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొన్నది. హైదరాబాద్ కేంద్రంగా సాగిన లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ నుంచి ఆప్ కు 100 కోట్ల రూపాయల ముడుపులు ముట్టచెప్పినట్లు ఈడీ వివరించింది. ఎమ్మెల్సీ కవిత తరపున అరుణ్ పిళ్లయ్ ప్రాతినిధ్యం వహించారని, ఇండో స్పిరిట్ కంపెనీలో 65% వాటా సౌత్ గ్రూప్ దే అని రిపోర్టు ద్వారా కోర్టుకు ఈడీ అధికారులు సమర్పించారు. సౌత్ గ్రూప్ లో కవిత భాగస్వామిగా ఉన్నారని ఆమె పేరును ప్రస్తావించారు.

సౌత్ గ్రూపులో ఎవరున్నారంటే..!
సౌత్ గ్రూప్ సిండికేట్ లో మాగుంట రాఘవరెడ్డి, విజయ్ నాయర్, బుచ్చిబాబుతోపాటు కల్వకుంట్ల కవిత ఉన్నారని మొదటిసారి సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. లిక్కర్ పాలసీ ద్వారా వచ్చే లాభాల్లో ఆరు శాతం సౌత్ గ్రూప్ కు.. ఆరు శాతం ఆప్ పార్టీకి పంచుకుంటూ.. ఈ డీల్ జరిగిందని సిసోడియా విచారణ తర్వాత ఈడీ వెల్లడించింది.

ఢిల్లీకి బయల్దేరిన కేటీఆర్
మంత్రి కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. పార్టీ విసృతస్థాయి సమావేశం ముగియగానే ఆయన ఢిల్లీకి పయనమయ్యారు. రేపు ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించనున్న నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ఇప్పటికే పార్టీ లీగల్ టీమ్ హస్తినకు చేరుకుంది. కేటీఆర్ అక్కడికి చేరుకున్నాక కవిత, లీగల్ టీమ్ తో  భేటీ కానున్నారు. రేపు, ఎల్లు్ండి కేటీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారని తెలుస్తోంది.

Also read: