DELHI :మలివాల్ కేసు విచారణకు సిట్

DELHI : ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై ఢిల్లీ(DELHI) సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడి కేసులో ముందడుగు పటింది. ఈ అంశంపై విచారించేందుకు ఢిల్లీ పోలీసులు సిట్ ఏర్పాటు చేశారు. ఉత్తర ఢిల్లీ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ అంజిత చెప్యాల నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ కేసు దర్యాప్తు కొనసాగించనుంది. ఈ టీమ్ లో ముగ్గురు ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారులు కూడా ఉన్నారు. విచారణ అనంతరం సిట్‌ తన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తుందని పోలీసులు వెల్లడించారు. మే 13న ఉదయం మలివాల్‌పై కేజ్రీవాల్ బిభవ్ కుమార్ దాడి చేసినట్లు ఆరోపణలొచ్చాయి.

ALSO READ :