Delhi: బ్లూ స్టిక్కర్ లేకుంటే నో ఎంట్రీ

Delhi

దేశ రాజధాని (Delhi) ఢిల్లీ మరోసారి తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.ఇవాళ ఉదయం ఘనమైన విషపు పొగ నగరాన్ని కమ్మేసింది.ముందున్న వాహనాలు కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది.చిల్లా బోర్డర్ వద్ద పరిస్థితి అత్యంత దారుణంగా మారింది.గాలి నాణ్యత సూచీ ఏకంగా 490కి చేరింది.దీంతో అధికారులు వెంటనే జీఆర్‌ఏపీ స్టేజ్–4 అమల్లోకి తీసుకొచ్చారు.ఈ దశలో అత్యంత కఠిన నిబంధనలు అమలవుతాయి.(Delhi) వాహనాలపై కఠిన నియంత్రణలు విధిస్తారు.ప్రజలకు ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు.

Image

ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్ ఉన్న నాన్–బీఎస్6 వాహనాలపై పూర్తి నిషేధం విధించారు.అలాంటి వాహనాలు నగరంలోకి వస్తే రూ.20 వేల జరిమానా విధిస్తారు.లేదంటే యూ–టర్న్ తీసుకొని తిరిగి వెళ్లాల్సిందే.రవాణా శాఖ ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించింది.డీఎన్డీ ఫ్లైవ్‌వే, చిల్లా సరిహద్దుల్లో తనిఖీలు కఠినంగా కొనసాగుతున్నాయి.ఢిల్లీ పోలీసులు, రవాణా శాఖ అధికారులు కలిసి బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Image

ప్రతి వాహనాన్ని ఆపి పరిశీలిస్తున్నారు.బ్లూ స్టిక్కర్ ఉన్నదా లేదా అని చెక్ చేస్తున్నారు.బ్లూ స్టిక్కర్ లేకుంటే నగరంలోకి అనుమతించడం లేదు.బ్లూ స్టిక్కర్ ఉన్న వాహనాలను కూడా పూర్తిగా వదలడం లేదు.అక్కడికక్కడే ఆపి ఎమిషన్ వివరాలు పరిశీలిస్తున్నారు.నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై భారీ జరిమానాలు విధిస్తున్నారు.

ప్రత్యేకంగా పాత వాహనాలపై ఆంక్షలు మరింత కఠినంగా ఉన్నాయి.10 ఏళ్లకు పైగా ఉన్న డీజిల్ వాహనాలను పూర్తిగా అడ్డుకుంటున్నారు.15 ఏళ్లకు పైగా ఉన్న పెట్రోల్ వాహనాలకు కూడా నో ఎంట్రీ.బీఎస్–3 లేదా అంతకంటే తక్కువ ఎమిషన్ ప్రమాణాల వాహనాలను పూర్తిగా నిషేధించారు.ఈ వాహనాలు అత్యధికంగా హానికర వాయువులను విడుదల చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

Image

రవాణా శాఖ అధికారి దీపక్ ఈ విషయంపై స్పందించారు.వాహన కాలుష్యంపై ప్రజలకు ఇప్పటికే పూర్తి అవగాహన ఉందన్నారు.నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.అయితే డ్రైవర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఫరీదాబాద్‌కు చెందిన రాకేష్ అనే డ్రైవర్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.
కాలుష్యాన్ని నియంత్రించలేకపోతే దాని భారాన్ని జరిమానాల రూపంలో ప్రజలపై వేయడం అన్యాయమని అన్నాడు.

Image

ప్రభుత్వ బస్సుల ఎమిషన్లను కూడా అదే స్థాయిలో ఎందుకు తనిఖీ చేయడం లేదని ప్రశ్నించాడు.కేవలం ప్రైవేట్ వాహనాలనే టార్గెట్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు.ఇదిలా ఉండగా ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో వాహనాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.మొత్తం వాహనాల్లో సుమారు 37 శాతం పాతవేనని అంచనా.ఈ వాహనాలు కొత్త వాహనాల కంటే ఎక్కువగా కాలుష్యం విడుదల చేస్తున్నాయి.

As many as 80 enforcement teams will be deployed (Photo: Archives)

నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.కేవలం ఫైన్లు, నిషేధాలతో సమస్య తీరదని చెబుతున్నారు.స్క్రాపేజ్ పాలసీని కఠినంగా అమలు చేయాలని సూచిస్తున్నారు.బలమైన ప్రజా రవాణా వ్యవస్థ అవసరమని అభిప్రాయపడుతున్నారు.కఠిన ఎమిషన్ తనిఖీలు తప్పనిసరిగా జరగాలంటున్నారు.అంతర్‌రాష్ట్ర స్థాయిలో సమన్వయం లేకపోతే కాలుష్య నియంత్రణ అసాధ్యమని హెచ్చరిస్తున్నారు.

ఢిల్లీ ప్రజలు మాత్రం ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందోనని ఆందోళన చెందుతున్నారు.ప్రతి శీతాకాలంలో ఇదే సమస్య పునరావృతమవుతుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Also read: