ఢిల్లీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న వేళ.. నీటి సమస్య పరిష్కారానికి ఢిల్లీ(DELHI) ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌ల నుంచి ఒక నెల పాటు అదనపు నీటిని సరఫరా చేసేలా చూడాలని అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఈ నేపథ్యంతోనే సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మండుతున్న ఎండలో నీటి డిమాండ్ గణనీయంగా పెరిగిందని.. పొరుగు రాష్ట్రాల నుంచి సరఫరా తగ్గిందన్నారు. బీజేపీ సభ్యులు నిరసన చేసే బదులు తమకు సహకరించాలని కోరారు. ఢిల్లీకి(DELHI) నెల రోజుల పాటు నీటిని అందించడానికి హర్యానా, యుపీ రాష్ట్రాలతో బీజేపీ మాట్లాడితే.. ప్రజలు అభినందిస్తారని పేర్కొన్నారు. అందరం కలిసి పని చేస్తేనే ప్రజలకు ఉపశమనం కలిగించగలమని రాసుకొచ్చారు.
ALSO READ :

