Raj Singh : దిగొచ్చిన రాజాసింగ్

ఎమ్మెల్యే రాజాసింగ్(Raj Singh) ఎట్టకేలకు అలకవీడారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాతనగరంలో నిర్వహించే రోడ్ షోలో రాజాసింగ్ (Raj Singh)పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. మాధవీలతను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఆయన హైదరాబాద్ లో ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇటీవల బీజేపీ అగ్రనేత అమిత్ షా, నేషనల్ ఆర్గనైజింగ్ జాయింట్ సెక్రటరీ శివప్రకాశ్ హైదరాబాద్ కు వచ్చినప్పటికీ రాజాసింగ్ దూరంగానే ఉన్నారు. కానీ ఇవాళ జరిగే అమిత్ షా రోడ్ షోలో పాల్గొంటానని రాజాసింగ్ ప్రకటించడం గమనార్హం.

 

Also read :

lok sabha : లోక్ సభ బరిలో 525 మంది

Rajinikanth : తలైవా బయోపిక్! హీరో ఎవరంటే??