NITI AAYOG: 2047 నాటికి వికసిత్​ భారత్​

2047 నాటికి భారత్​ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేరాలన్నారు. తన అధ్యక్షతన ఢిల్లీలో ఇవాళ జరిగిన నీతి ఆయోగ్(NITI AAYOG)​ సమావేశంలో ఈ మేరకు వికసిత్​ భారత్​ లక్ష్యాలను వెల్లడించారు. దేశంలోని ప్రతి పల్లె, గ్రామం, పట్టణం, నగరం ఇలా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలన్నారు. ప్రతి రాష్ట్రంలో ఒక పర్యాటక ప్రదేశాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా మౌళిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. తద్వారా వాటికి సమీపంలోని నగరాలు టూరిస్ట్ కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. పట్టణీకరణ దేశంలో వేగంగా వృద్ధి చెందుతుందని, అందుకు తగ్గట్టుగా భవిష్యత్తు నగరాలపై పని చేయాలన్నారు(NITI AAYOG)​. విధాన నిర్ణయాల్లో మహిళల పాత్రను నొక్కి చెప్పిన ఆయన వారిని భాగస్వాములను చేయాలన్నారు. అమలు చేసే విధానాలు పౌరుల జీవితాల్లో మార్పు తెచ్చే విధంగా ఉండాలన్నారు. ప్రజలు ఆ మార్పును అనుభవించినప్పుడే ఉద్యమంగా బలపడుతుందని చెప్పారు. దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఇదో గొప్ప అవకాశంగా తీసుకోవాలన్నారు.

Also Read :