KCR:పటేల్ పట్వారీలు వస్తరు

KCR:పటేల్ పట్వారీలు వస్తరు

చాలీస్ హజార్ తీయ్యుమంటరు
= ధరణి తీసేస్తే ఎన్ని ఇబ్బందులుంటయ్
= రైతుబంధు, రైతుబీమా ఎట్లొస్తున్నయ్
= తలలు పలగ్గొట్టుకొని మూడేండ్లు కష్టపడి ధరని తెచ్చినం
= కాంగ్రెస్ గెలిస్తే కైలాసం ఆటల పెద్దపాము మింగినట్టయితది
= బీజేపీ ఓ చెత్త కుప్ప పార్టీ.. వచ్చే ఎన్నికల్లో మోదీ ఓటమి ఖాయం
= ఆదిలాబాద్ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్(KCR)
ఆదిలాబాద్: ‘మూడేండ్లు కష్టపడి తలలు పలగ్గొట్టుకొని తెచ్చిన ధరణిని కాంగ్రెసోళ్లు తీసేస్తమంటుండ్రు.. ఇయ్యాల ధరణి ఉంది కాబట్టే రైతుబంధు పడుతుంది.. మేం హైదరాబాద్ లో పైసలేస్తె.. టింగ్ టింగ్ మని మీ సెల్ ఫోన్ మోగుతుంది. కడుపుల సల్ల కదలకుంట పైసలు మీ ఖాతాల పడుతున్నయ్.. భూములు అమ్మితే పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు అయితున్నయ్.. ధరణి ఉంది కాబట్టే రైతు బీమా వస్తుంది. పంటలు కొన్న పైసలు కూడా అట్లే వస్తున్నయ్.. ఇట్లాంటి ధరణి తీసేస్తే.. ఏమైతది.. మళ్లీ పలేట్ పట్వారీలు వస్తరు.. చాలీస్ హజార్ తీయ్ అంటరు.. ఇప్పుడు మంచిగుందా..? అప్పుడు మంచిగుంటదా..? కాంగ్రెస్ పార్టీ ధరణి తీసేస్తదట.. ధరణి ఉండాల్నా.. వద్దా మీరే నిర్ణయించుకోవాలె.. కాంగ్రెస్ కు ఓటేస్తే కైలాసంల పెద్దపాము మింగినట్లయితది.. మంది మాటలు పట్కోని మార్మానం పోతె మళ్లొచ్చెవరకు ఇల్లు కాలిపోయినట్లయితది. మీరు బాగా ఆలోచన చెయ్యాలె.. ఎవరో చెప్పిండ్రని ఓటు వేయొద్దు.. గ్రామాలకు వెళ్లి చర్చ పెట్టాలె.. మనకు ఏ ప్రభుత్వం ఉండాల్లో వివరించి చెప్పాలె..’అని సీఎం కేసీఆర్(KCR) అన్నారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ (KCR)మాట్లాడారు. రైతుబంధు పథకం రావాలన్నా, 24 గంటల కరెంటు కావాలన్నా జోగురామన్న గెలవాలని అన్నారు. 24 గంటల కరెంటు వద్దు మూడు గంటలు చాలు అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అలా అయితే ప్రతి రైతుకు 10 హెచ్ పీ మోటార్లు అవసరం ఉంటుందని, ఎవరు వాటిని కొనిస్తారని కేసీఆర్(KCR) ప్రశ్నించారు. ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. కరెంటు కావాల్నా.. కాంగ్రెస్ కావాల్నా, రైతుబంధు కావాల్నా.. రాబందులు కావాల్నా.. ప్రజలే తేల్చుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీ ఓ చెత్త కుప్ప పార్టీ
బీజేపీ పార్టీ చెత్తకుప్ప పార్టీ అని.. ఆ పార్టీకి ఒక్క ఓటు వేసినా చెప్పకుప్పలో వేసినట్లే అని.. వేస్ట్ అని కేసీఆర్(KCR) అన్నారు బీజేపీ మతతత్వ పార్టీ అని.. మతాల మధ్య చిచ్చు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్(KCR). వచ్చే ఎన్నికల్లో మోదీ ఓడిపోతాడని, ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు. మీ ఓటు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారాయన. బీఆర్ఎస్ ను గెలిపిస్తే ఢిల్లీలో సత్తా చూపిస్తామన్నారు.

Read More: