Diwali: ధన త్రయోదశి రోజున ఈ వస్తువులు కొనవద్దు!

Diwali

దీపావళి (Diwali) పండుగకు ముందు వచ్చే ధన త్రయోదశి (అక్టోబర్ 18) ప్రత్యేకమైన రోజు. ఈ రోజు బంగారం, వెండి, కొత్త పాత్రలు కొనడం శుభప్రదమని హిందూ సంప్రదాయాలు చెబుతున్నాయి. (Diwali) రోజు లక్ష్మీ దేవిని పూజిస్తే ధనసమృద్ధి కలుగుతుందని నమ్మకం.

Image

అయితే, కొన్నింటిని మాత్రం ధన త్రయోదశి రోజు కొనరాదు అని పురోహితులు హెచ్చరిస్తున్నారు. శనికి చిహ్నమైన ఇనుము వస్తువులు కొనకూడదని చెబుతున్నారు. అదేవిధంగా రాహువు చిహ్నమైన గాజు వస్తువులు కూడా ఆ రోజున కొనరాదు.

Image

అలాగే స్టీల్ వస్తువులు, సూదులు, కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులు, నెయ్యి, నూనె, నల్ల రంగు దుస్తులు లేదా సామాగ్రి కూడా కొనడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఈ వస్తువులు ఆధ్యాత్మికంగా శుభం కాదని, దురదృష్టం తీసుకువచ్చే అవకాశముందని నమ్మకం ఉంది.

ధన త్రయోదశి రోజున గృహంలో దీపం వెలిగించి, ధనలక్ష్మీదేవిని పూజించడం, పసుపు, కుంకుమ, చందనం, బంగారం, ధాన్యాలు వంటి వస్తువులను సమర్పించడం అత్యంత శుభప్రదమని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.

Also reas: