DK Aruna : టెన్షన్ లో రేవంత్

కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ సీట్లు తగ్గితే తన సీటుకు ఎసరు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి టెన్షన్ పడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna)అన్నారు. ఆయనకు పాలన అనుభవం లేదని, అందుకే రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని ఆమె విమర్శించారు. రేవంత్ రాజకీయాలు పక్కనపెట్టి మొదట ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. హైదరాబాదులో తన స్వగృహంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన పట్ల ఏమాత్రం అవగాహన లేదు. ఐదు నెలలు అవుతున్న పాలనపై పట్టు సాధించలేదు.. కేవలం హైప్ క్రియేట్ చేసే మాటలు మాట్లాడుతున్నరు. అంతేతప్ప తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు ఏవి లేవు. రాష్ట్రంలో బీజేపీ 10––12సీట్లు గెలవబోతోంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

 

Also read :

Indonesia :శవాల పండగ

Kangana : సినిమాలే చాలా ఈజీ