అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అమెరికా కోరింది. ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు బడ్డీ కార్టర్ ఈ మేరకు నార్వేలోని నోబెల్ కమిటీకి ఓ లేఖ రాశారు. అసాధ్యమనుకొన్న సంక్షోభాల్లో కూడా వేగంగా ఒప్పందాలు చేయించడంలో ట్రంప్(Trump) కీలక పాత్ర పోషించారని లేఖలో పేర్కొన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో చరిత్రాత్మక పాత్ర పోషించారని వివరించారు. దీంతోపాటు ప్రపంచంలోనే ఉగ్రవాదులను పోషించే అతిపెద్ద దేశానికి అత్యంత వినాశకర ఆయుధం అందకుండా చేశారని, ఆయన నాయకత్వాన్ని నోబెల్ ప్రైజ్‌తో గుర్తించాలని కోరారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధాన్ని ఆపుతూ ఆయన ఒప్పందం కుదిర్చారని కూడా లేఖలో పేర్కొన్నారు. సాధారణంగా నోబెల్ శాంతి బహుమతికి ఆయా దేశాల జాతీయ పార్లమెంట్ సభ్యులు, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, ఇతరులు నామినేషన్లను సమర్పించవచ్చు. మరోవైపు నోబెల్ శాంతి బహుమతి తనను వరించకపోవచ్చని ఇటీవల కాలంలో ట్రంప్ తీవ్ర నిరాశ వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు చేస్తూ ‘‘నేను ఏం చేసినా.. నాకు నోబెల్ ప్రైజ్ రాదు. భారత్-పాక్ మధ్య యుద్ధం ఆపినా.. సెర్బియా – కొసావో మధ్య పోరాటాన్ని నిలిపినా తనకు మాత్రం బహుమతి లభించదు’’ అని విచారం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో అమెరికా నుంచే ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ ప్రతిపాదన వెళ్లడం విశేషం. ఇదిలా ఉండగా ‘ఇటీవలి భారత్-పాకిస్తాన్ సంక్షోభ సమయంలో దౌత్య పరమైన జోక్యం, కీలకమైన నాయకత్వానికి గుర్తింపుగా ట్రంప్ ఈ అవార్డుకు అర్హులని పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవలే ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
దీంతోపాటు ప్రపంచంలోనే ఉగ్రవాదులను పోషించే అతిపెద్ద దేశానికి అత్యంత వినాశకర ఆయుధం అందకుండా చేశారని, ఆయన నాయకత్వాన్ని నోబెల్ ప్రైజ్‌తో గుర్తించాలని కోరారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధాన్ని ఆపుతూ ఆయన ఒప్పందం కుదిర్చారని కూడా లేఖలో పేర్కొన్నారు. సాధారణంగా నోబెల్ శాంతి బహుమతికి ఆయా దేశాల జాతీయ పార్లమెంట్ సభ్యులు, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, ఇతరులు నామినేషన్లను సమర్పించవచ్చు. మరోవైపు నోబెల్ శాంతి బహుమతి తనను వరించకపోవచ్చని ఇటీవల కాలంలో ట్రంప్ తీవ్ర నిరాశ వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు చేస్తూ ‘‘నేను ఏం చేసినా.. నాకు నోబెల్ ప్రైజ్ రాదు. భారత్-పాక్ మధ్య యుద్ధం ఆపినా.. సెర్బియా – కొసావో మధ్య పోరాటాన్ని నిలిపినా తనకు మాత్రం బహుమతి లభించదు’’ అని విచారం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో అమెరికా నుంచే ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ ప్రతిపాదన వెళ్లడం విశేషం. ఇదిలా ఉండగా ‘ఇటీవలి భారత్-పాకిస్తాన్ సంక్షోభ సమయంలో దౌత్య పరమైన జోక్యం, కీలకమైన నాయకత్వానికి గుర్తింపుగా ట్రంప్ ఈ అవార్డుకు అర్హులని పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవలే ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
Also Read :
- PAK: న్యూక్లియర్ బాలిస్టిక్ మిస్సైల్స్ తయారు చేస్తున్న పాకిస్తాన్
- Telangana: రోడ్డు ప్రమాద బాధితులకు వారంలోగా రూ.1.5 లక్షలు